మీ కారులో టాయిలెట్ కంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది..! షాకింగ్ విషయాలు మీకోసం..!

సాధారణంగా మనకు క్రిములు, బ్యాక్టీరియాలు అంటే వెంటనే టాయిలెట్లు గుర్తుకు వస్తాయి. కానీ మీ కారులో టాయిలెట్ కంటే బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే ప్రదేశం ఉందని చెబితే నమ్మగలరా..? ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజం. మీ కారు ఎంత మెరిసిపోతున్నా.. దాచిన మురికి మనకు తెలియదు. మనం ప్రతిరోజూ తాకే కొన్ని భాగాలు చాలా ప్రమాదకరమైనవి.

మీ కారులో టాయిలెట్ కంటే ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది..! షాకింగ్ విషయాలు మీకోసం..!
Car Steering

Updated on: Jun 02, 2025 | 2:57 PM

కారులో మీరు డ్రైవ్ చేసే ప్రతి సారి స్టీరింగ్ వీల్‌ ను తాకుతారు. ఇది సాధారణ విషయమే. కానీ ఇది బ్యాక్టీరియాలకు కేంద్రం అవుతుందని చాలా మందికి తెలియదు. ఇది టాయిలెట్ సీటు కంటే ఎక్కువ మురికిగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కారు వాడే ప్రతిసారీ స్టీరింగ్‌ ను తాకుతారు. కానీ అది ఎంత శుభ్రంగా ఉందో గుర్తించరు.

ఫోన్, డోర్ హ్యాండిల్స్, ఫుడ్ ప్యాకెట్లు మొదలైనవి తాకిన చేతులతోనే మనం స్టీరింగ్‌ ను తాకుతాం. ఇలా చేయడం వల్ల ఆ క్రిములు బాగా త్వరగా స్టీరింగ్ మీదకి వెళ్తాయి. అలాగే కారులో తుమ్మినా, దగ్గినా కూడా స్టీరింగ్‌ కి సూక్ష్మక్రిములు అంటుకుంటాయి. ఇది రోజు రోజుకీ ఎక్కువగా పేరుకుపోతూ ఉంటుంది. మనం దీన్ని చూడలేం కానీ అవి అక్కడే పెరుగుతూ పోతాయి.

కారు ఖరీదైనదా లేక చౌకదా అనే తేడా లేకుండా ప్రతి కారులో ఈ సమస్య ఉంటుంది. క్రిములు కారును కాదు.. మన అలవాట్లను చూస్తాయి. మనం శుభ్రంగా చూసుకోకపోతే ఏ వాహనమైనా మురికిగా మారిపోతుంది. విలాసవంతమైన కార్లు కూడా మురికికి లోనవుతాయి. అందుకే కారుపై కాకుండా మన అలవాట్లపై దృష్టి పెట్టాలి.

ఈ సమస్యకు పరిష్కారం చాలా సులభంగా ఉంటుంది. వారం రోజులకి ఒక్కసారి యాంటీ బాక్టీరియల్ వైప్ లేదా ఇంటీరియర్ క్లీనర్ తీసుకుని స్టీరింగ్ వీల్‌ ను శుభ్రం చేయాలి. ఇది కేవలం రెండు నిమిషాల పని. కానీ దీని వల్ల మీరు అనేక రకాల క్రిముల నుంచి దూరంగా ఉంటారు. ప్రతి రోజు కారు నడిపే వారు తప్పనిసరిగా ఈ అలవాటు పాటించాలి.

చాలా మంది ఈ చిన్న చర్యను పట్టించుకోరు. కొన్ని అధ్యయనాల ప్రకారం 32 శాతం మంది డ్రైవర్లు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కారు శుభ్రం చేస్తారు. అలాగే 12 శాతం మంది అసలు శుభ్రం చేయరు. ఇది కేవలం కనపడే సౌందర్యానికి సంబంధించినది కాదు. ఇది ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. కారులో ఉండే బ్యాక్టీరియా మీకు జలుబు, ఫ్లూ వంటి సమస్యలు కలిగించవచ్చు.

టాయిలెట్ వాడిన తర్వాత ఎలా చేతులు కడుక్కుంటామో.. అలాగే స్టీరింగ్ వీల్‌ ను శుభ్రంగా ఉంచడమూ అవసరం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడే చిన్న పని. ప్రతి వారం కొన్ని నిమిషాలు కేటాయించటం వల్ల ముప్పు తగ్గుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయొద్దు.