AC Side Effects: హాయిగా ఉందని ఏసీలోనే ఎక్కువ సమయం ఉంటున్నారా..? ఈ చెడు ప్రభావాలు తప్పవు

|

Jun 06, 2024 | 9:47 AM

ఏసీలో ఎక్కువ సమయం గడిపేవారు డీ హైడ్రేషన్ కు గురై బయటకు వెళ్లినప్పుడు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటుంటారు. అధిక సమయం ఏసీలో ఉండటం వల్ల అకస్మిక జలుబు, ముక్కు నుండి నీరు కారటం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఏసీలలో ఎక్కువ సమయం ఉండకూడదు. ఇది కీళ్ల నొప్పులను మరింత ఎక్కువ చేస్తుంది.

AC Side Effects: హాయిగా ఉందని ఏసీలోనే ఎక్కువ సమయం ఉంటున్నారా..? ఈ చెడు ప్రభావాలు తప్పవు
AC Side Effects
Follow us on

ఓ వైపు వర్షాలు పడుతున్నాయి..మరోవైపు ఎండలు కూడా దంచికొడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నుంచి ఆఫీసు వరకు అందరూ ఏసీ ముందే ఎక్కువ సమయం గడపుతున్నారు. కానీ, ఇది ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు. ఏసీ అధిక వినియోగంపై ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇది చర్మం నుండి శ్వాస తీసుకోవడం వరకు అనేక సమస్యలను కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. పగలు, రాత్రి నిరంతరాయంగా AC గాలిని వినియోగిస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏసీ అధిక వినియోగం వల్ల చర్మం పొడిబారడం, తలనొప్పి, వికారం, దగ్గు, అనేక శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. దీని గురించి వైద్యులు ఇటీవల ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారో ఇక్కడ తెలుసుకుందాం..

ఏసీ వల్ల ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఎసిలో ఎక్కువసేపు ఉండటం వల్ల చర్మం పొడిబారడం, పొడి దగ్గు, తలనొప్పి, కళ్లు తిరగడం లేదా వికారం, అలసట వంటి అనేక రకాలుగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వాసనకు సున్నితత్వం, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది మొదలైనవిగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏసీని ఎప్పుడూ చాలా పరిశుభ్రంగా వాడాలి. ఫిల్టర్ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. డక్ట్ తరచూ చెక్‌ చేస్తూ ఉండాలి. అందులో సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి. కలుషితాలను పీల్చడం వల్ల అంటు వ్యాధులు, అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. ఏసీలో ఎక్కువ సమయం గడపడం వల్ల అలర్జిక్ రినైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

ఏసీలో ఎక్కువ సమయం ఉండటంవల్ల శ్వాసకోశ సమస్యలు ఎదురవుతాయి. ముక్కు, గొంతు సమస్యలు తలెత్తుతాయి. అలాగే, ఏసీలో సరైన ఎయిర్‌ ఫిట్లర్‌ లేకుంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే, ఏసీలో ఎక్కువ సమయం గడిపేవారు డీ హైడ్రేషన్ కు గురై బయటకు వెళ్లినప్పుడు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటుంటారు. అధిక సమయం ఏసీలో ఉండటం వల్ల అకస్మిక జలుబు, ముక్కు నుండి నీరు కారటం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు ఏసీలలో ఎక్కువ సమయం ఉండకూడదు. ఇది కీళ్ల నొప్పులను మరింత ఎక్కువ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..