ఒంటిపై ట్యాన్‌ తొలగించేందుకు అద్భుత స్క్రబ్‌లు..! ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..

ఉండే నేచురల్ వైట్నింగ్ ఏజెంట్ చర్మంలోని బ్రౌన్ లేయర్‌ని తొలగించడంలో సహాయపడుతుంది. టమోటాను సగానికి కట్ చేసి, మీ ముఖం, మీ శరీరంలోని ఇతర ట్యాన్‌ అయిన భాగాలను సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇందుకోసం సగం మాత్రమే ఉపయోగించాలి.

ఒంటిపై ట్యాన్‌ తొలగించేందుకు అద్భుత స్క్రబ్‌లు..! ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
Homemade scrubs

Updated on: May 20, 2024 | 7:17 PM

వేసవి కాలం సాధారణంగా సన్‌బర్న్, డ్రై, డల్ స్కిన్, హీట్ రాష్ వంటి చర్మ సంరక్షణ సమస్యలను తెస్తుంది. తీవ్రమైన సూర్యకాంతి కారణంగా వేడి వాతావరణంలో చర్మ సంరక్షణ సమస్యల్లో టానింగ్ ఒకటి. ఇంట్లో తయారుచేసిన స్క్రాబ్‌లు, ఫేస్ మాస్క్‌లను ఉపయోగించడం వల్ల సూర్యుని వల్ల చర్మం నల్లబడటం, టానింగ్‌ను తొలగిస్తుంది. టానింగ్‌ను తొలగించడానికి మీరు ఉపయోగించే కొన్ని ప్రభావవంతమైన, సహజమైన స్క్రబ్‌లు తయారీ ఇక్కడ తెలుసుకుందాం..

కాఫీ, తేనె

కాఫీ, తేనె స్క్రబ్‌ చేయడానికి, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మిక్స్ చేసి, ఆపై మీ ముఖానికి సమానంగా అప్లై చేయండి. పది నుంచి ఇరవై నిమిషాల పాటు ముఖానికి ప్యాక్ వేసుకున్న తర్వాత చేతివేళ్లతో మసాజ్ చేసి చల్లటి నీటితో కడిగేయాలి.

ఓట్ మీల్, మజ్జిగ..

ఓట్ మీల్, మజ్జిగ మాస్క్ చేయడానికి ఓట్స్, మజ్జిగను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పేస్ట్ మెత్తగా అయ్యాక అందులో తేనె, ఒక టేబుల్ స్పూన్ బాదం నూనె కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ఉపయోగించి మీ చర్మం ట్యాన్‌ అయిన చోట సున్నితంగా మసాజ్ చేయండి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

పసుపు, శెనగపిండి..

పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు సన్ టానింగ్‌లో అద్భుతాలు చేస్తాయి. మీరు మీ చర్మం సూర్యరశ్మితో టాన్ అయిన చోట సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టేబుల్ స్పూన్ పసుపుతో చేసిన పేస్ట్‌ను ఉపయోగించవచ్చు.

టమాటో ఫేస్ స్క్రబ్..

టమాటోలో ఉండే నేచురల్ వైట్నింగ్ ఏజెంట్ చర్మంలోని బ్రౌన్ లేయర్‌ని తొలగించడంలో సహాయపడుతుంది. టమోటాను సగానికి కట్ చేసి, మీ ముఖం, మీ శరీరంలోని ఇతర ట్యాన్‌ అయిన భాగాలను సున్నితంగా మసాజ్‌ చేయాలి. ఇందుకోసం సగం మాత్రమే ఉపయోగించాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..