
ఈ రోజుల్లో మిలియన్ల మంది ప్రజలు కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారు. ఇది నిజంగానే ఆందోళన కలగించే విషయం. బాధాకరమైన పరిస్థితిని కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారు విపరీతమైన నొప్పితో అవస్థపడుతుంటారు. కొందరిలో కిడ్నీలో రాళ్ల సమస్య తరచూ వేధిస్తూ ఉంటుంది. దీనికి సరైన చికిత్స, లేదంటే, సర్జరీ తర్వాత కూడా కొందరిలో మళ్లీ రాళ్లు రావడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. అయితే, ఆయుర్వేదంలో దీనికి ఓ ఉపాయం ఉంది. పదే పదే వేధించే కిడ్నీ స్టోన్స్ సమస్యను వదిలించుకోవడానికి కొన్ని నివారణ మార్గాలను సూచించారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కిడ్నీలో రాళ్లు పేరుకుపోవడం అంటే.. వివిధ ఖనిజాలు, లవణాలతో కూడిన ఘన పదార్థాలు ఏర్పడటం.. అవి చిన్న చిరు ధాన్యం సైజు నుండి పెద్ద రాళ్ల వరకు పెరుగుతాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ లేదా ఇతర సమ్మేళనాలతో కూడి ఉంటాయి. అయితే, ఆయుర్వేదం ప్రకారం.. కిడ్నీ స్టోన్స్ సమస్యకు దోసకాయ గింజలు అద్భుత ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఇందుకోసం మార్కెట్‌లో లభించే దోసకాయ గింజలను పాలలో కలుపుకుని తాగాలి. మొదట 200 గ్రాముల పాలు మరిగించి చల్లబరుచుకోవాలి. దీనికి 50 గ్రాముల దోసకాయ గింజల పొడిని అందులో వేసి కలుపుకోవాలి. ఇందుకోసం ముందుగానే దోసకాయ గింజలను మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. మీకు డయాబెటిస్ లేకపోతే, మీరు కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కనీసం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ డ్రింక్ తాగాలి. ఇది కిడ్నీలో రాళ్లు మళ్లీ రాకుండా కాపాడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యను తగ్గించుకోవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..