
మన దినచర్యలో ఏదో ఒక పూట ఖచ్చితంగా అన్నం తింటాం. అయితే, అన్నం తినడం వల్ల షుగర్ పెరుగుతుంది, బరువు పెరుగుతారని మనం తరచుగా వింటుంటాం. మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రకూడా వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో చాలా మంది బియ్యాన్ని కడిగిన వెంటనే వండుతున్నారు. ఇది కరెక్ట్ పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. అన్నం వండే ముందు బియ్యాన్ని ఖచ్చితంగా నానబెట్టాలి. ఇది ఆరోగ్యానికి సంబంధించిన విషయం.
మన అన్నం వండే ముందు బియ్యాన్ని ముందుగానే కడిగి నీటిలో కాసేపు నానెబెట్టాలని పెద్దలు చెబుతుంటారు. ఇదే అలవాటును ఇప్పటికీ చాలా మంది పాటిస్తూ ఉంటారు. కానీ, నేడు చాలా మంది బియ్యం కడిగి వెంటనే స్టౌవ్ మీద పెట్టి ఉడికిస్తుంటారు. కానీ, ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. బియ్యాన్ని కడిగిన తరువాత కనీసం 10 నిమిషాలు నీటిలో నానబెట్టాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.
వండే ముందు కడిగి నానబెట్టిన బియ్యంలో ఉండే, ఫైటిక్ యాసిడ్‌ను తొలగించడంలో సాయపడుతుంది. పోషక శోషణను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా జింక్, ఐరన్ లోపాలతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా అన్నం వండేముందు బియ్యాన్ని కడిగి నానబెట్టాలని చెబుతున్నారు. బియ్యంలో సహజంగా ఆర్సెనిక్ ఉండే అవకాశం ఉంటుంది. ఇది నేల, నీటిలో ఉండే విషపూరితమైన మూలకం. దీనిని పంట సమయంలో వడ్లు పీల్చుకుంటాయి. బియ్యం ఇతర ధాన్యాల కంటే ఆర్సెనిక్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. అయితే, బియ్యాన్ని కడిగి నానబెట్టడం వల్ల ఆర్సెనిక్ కంటెంట్ తగ్గుతుందని, దీంతో ఆరోగ్యానికి హానీ కూడా తగ్గుతుంది.
బియ్యం కడిగి నానబెట్టడం వల్ల ఎంజైమాటిక్ విచ్ఛిన్నం చేస్తుంది. ఇది బియ్యంలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లను సరళమైన చక్కెరలుగా విచ్ఛిన్నం చేస్తుంది. ఇది GI (గ్లైసెమిక్ ఇండెక్స్)ని కూడా తగ్గిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడానికి సాయపడుతుంది. ఇక, బియ్యాన్ని నానబెట్టే ముందు రెండు – మూడు సార్లు కడగడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. బియ్యాన్ని కడిగి నానబెట్టడం వల్ల అన్నం త్వరగా ఉడుకుతుంది. పర్ఫెక్ట్‌గా ఉడుకుతుంది. కడుపులో జిగటను నివారిస్తుంది. రుచి కూడా పెరుగుతుంది. మీ గ్యాస్ కూడా ఆదా అవుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..