
సమ్మర్ సీజన్ ముందుగానే మొలైపోయింది. భానుడు తన స్టైల్‌లో ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండవేడి రోజు రోజుకూ ఎక్కువ అవుతుంది. వేసవిలో ముందు నుంచే సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వడ దెబ్బ తగులుతుంది. అలాగే సమ్మర్‌లో ఎక్కువగా డీహైడ్రేష్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సమ్మర్‌లో దొరికే వాటిల్లో మామిడి పండు కూడా ఒకటి. ఇది అందరికీ ఫేవరెట్ పండు అని చెప్పొచ్చు. మామిడి పండు అంటే ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి దాకా అందరూ మామిడి పండును ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. మామిడిలో పోషకాలు అనేవి పుష్కలంగా లభిస్తాయి. అందులోనూ సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఖచ్చితంగా తినాలి. అయితే పండిన మామిడి కంటే.. పచ్చి మామిడిలో పోషకాలు ఎక్కువ. మరి పచ్చి మామిడి తింటే ఎలాటి బెనిఫిట్సో ఇప్పుడు చూద్దాం.
పచ్చి మామిడిలో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉన్నాయి. విటమిన్లు సి, ఎ, కె, ఇ, బి6, క్యాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటివి పుష్కలంగా ఉంటాయి.
పచ్చి మామిడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీంతో రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.
పచ్చి మామిడిలో పాలి ఫెనాల్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులతో పోరాడుతుంది. పచ్చి మామిడిలో యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. అలాగే లుకేమియా, పెద్ద ప్రేగు, ఊపిరి తిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా చేస్తుంది.
డయాబెటీస్ ఉన్నవారు ఎలాంటి డౌట్స్ లేకుండా పచ్చి మామిడిని తినొచ్చు. ఇది తినడం వల్ల శరీరంలో షుగర్ లెవల్స్ అనేవి అదుపులో ఉంటాయి.
పచ్చి మామిడి తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఎందుకంటే దీనిలో నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. వడదెబ్బ నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే వేసవి కాలంలో వచ్చే జీర్ణ సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. జీర్ణ క్రియ పని తీరును మెరుగు పరుస్తుంది. అలాగే కాలేయ పని తీరుకు కూడా మంచిది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..