Health: మద్యమే కాదు నిద్ర కూడా లివర్‌ను దెబ్బ తీస్తుంది.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

|

Sep 20, 2024 | 9:53 AM

చైనాలోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి), నిద్రకు మధ్య సంబధం ఉన్నట్లు గుర్తించారు. పరిశోధన ప్రకారం, ఆరోగ్యకరమైన నిద్ర విధానాలు, ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయ రోగులలో సిర్రోసిస్ సమస్య లేనట్లు నిపుణులు గుర్తించారు...

Health: మద్యమే కాదు నిద్ర కూడా లివర్‌ను దెబ్బ తీస్తుంది.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు
Liver Cirrhosis
Follow us on

మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో లివర్‌ కీలక పాత్ర పోషిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాలేయం బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అయితే కొన్ని రకాల జీవనశైలి తప్పుల కారణంగా లివర్‌ పనితీరు దెబ్బతింటుంది. ముఖ్యంగా మద్యం సేవించే వారిలో లివర్‌ డ్యామేజ్ అవుతుందని మనందరికీ తెలిసిందే. అయితే నిద్రలేమి కూడా లివర్‌ ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య లివర్‌ సిర్రోసిస్ సమస్యకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

చైనాలోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి), నిద్రకు మధ్య సంబధం ఉన్నట్లు గుర్తించారు. పరిశోధన ప్రకారం, ఆరోగ్యకరమైన నిద్ర విధానాలు, ఆల్కహాలిక్ లేని కొవ్వు కాలేయ రోగులలో సిర్రోసిస్ సమస్య లేనట్లు నిపుణులు గుర్తించారు. పరిశోధన ప్రకారం దాదాపు 112,196 నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ బాధితుల్లో నిద్రలేమి సమస్య ఉన్నట్లు గుర్తించారు. ఇది సిర్రోసిస్ సమస్యకు ప్రధాన కారణంగా చెబుతున్నారు

దీర్ఘకాలంగా నిద్రలేమి సమస్యతో బాధపడే వారిలో సిర్రోసిస్ సమస్య ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. దీంతో లివర్‌పై క్రమంగా మచ్చ కణజాలం ఏర్పడుతుంది. ఈ గుర్తులు కాలేయం పనితీరును ప్రభావితం చేస్తాయి. ఈ పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, కాలేయం విఫలమయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. లివర్‌ సిర్రోసిస్‌ కారణంగా కాలేయంలోని ఆరోగ్యకరమైన కణజాలాలు నాశనమవుతాయి. కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా ఈ వ్యాధిని గుర్తించవచ్చే అవేంటంటే.

నిత్యం వాంతి, వికారంగా ఉండడం. ఎలాంటి కారణం లేకుండా ఆకలి తగ్గడం, చిన్న చిన్న పనులకే అలసిపోవడం, కామెర్లు రావడం, బరువు తగ్గడం, చర్మంపై దురద ఏర్పడడం, మూత్రం ముదురు రంగులో రావడం, జట్టు రాలడం, ముక్కు నుంచి రక్తం కారడం, కండరాల తిమ్మిరి, నిత్యం జ్వరం రావడం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి ఈ లివర్‌ సిర్రోసిస్ ప్రాథమిక లక్షణాలుగా నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..