ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోవాలని చెబుతారు. తక్కువ నిద్రపోతే కొవ్వు మాత్రమే కాదు, శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. మనకు రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవటం కారణంగా పగలు నిద్రపోతారు. అయితే, చాలా మందికి పగటి పూట కూడా నిద్రపోతుంటారు. అయితే, ఆయుర్వేదం ప్రకారం పగటిపూట నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ, అలసట, బద్ధకం, అధిక పని ఒత్తిడి కారణంగా చాలా మంది పగటి కూడా అలిసిపోయి నిద్రపోతుంటారు. మంచం, కుర్చీ, సోఫా ఇలా ఎక్కడైనా సరే.. అలా కునిపాట్లు తీస్తుంటారు. అయితే, పగటి పూట నిద్రపోవడం వల్ల శరీరంలో కఫా పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు. 10 నుండి 15 నిమిషాల నిద్ర ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ, పగటిపూట గాఢ నిద్ర చెడు ప్రభావాలను కలిగిస్తుంది. మీరు కూడా పగటి పూట చిన్న కనుకు తీయాలనుంటే..ముందుగా టైమ్ చూసుకోండి.. పగలు అతిగా నిద్రపోతే ప్రమాదమని గ్రహించండి.
మీరు ఫిట్‌గా ఉండటానికి, మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే, పగటిపూట నిద్రపోకండి. పొట్ట, నడుము కొవ్వు తగ్గాలని భావించే వారు..రాత్రిపూట సరిగా నిద్రపోవాలి. ఎక్కువ నూనె, వేయించిన ఆహారం, సాధారణ ఆహారం తినే వ్యక్తులు పగటిపూట నిద్రకు దూరంగా ఉండాలి. మధుమేహం, హైపోథైరాయిడ్, పిసిఒఎస్‌తో బాధపడేవారికి కూడా పగటిపూట నిద్రమంచిది కాదని చెబుతున్నారు.
ప్రయాణాల వల్ల బాగా అలసిపోయిన వారికి పగటిపూట నిద్రపోవడం మంచిది. చాలా సన్నగా, బలహీనంగా ఉన్నవారు కూడా పగలు నిద్రపోతే ఎలాంటి ప్రభావం ఉండదు. తీవ్రమైన అనారోగ్యం లేదా శస్త్రచికిత్స తర్వాత పగటిపూట విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ మీకు చెబితే, దానిని ఖచ్చితంగా పాటించండి. ప్రసవం తర్వాత స్త్రీలకు కూడా విశ్రాంతి అవసరం, వారు పగటిపూట కూడా నిద్రపోవాలి. 10 ఏళ్లలోపు, 70 ఏళ్లు పైబడిన వారు పగటిపూట విశ్రాంతి తీసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..