Skin Care Tips: ఎండవల్ల మీ ముఖం నల్లగా మారిందా? ఈ టిప్స్ మీకోసమే..

|

Sep 07, 2023 | 1:12 AM

మీరు ఎండలో ఎక్కువ సమయం బయట ఉంటున్నారా? అయితే, స్కిన్ టానింగ్ సమస్య వస్తుంది. దీని నుంచి బయటపడేందుకు చాలామంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఏవేవో టిప్స్ పాటిస్తుంటారు. ఒక్కోసారి వేలకు వేలు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. స్టెరాయిడ్ క్రీమ్ సొంతంగా ముఖానికి రాసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితిలో సూర్యరశ్మిని ఎలా నిరోధించాలో తెలుసుకోవడం ముఖ్యం. అందుకు నిపుణులు చెప్పే కొన్ని చిట్కాలు

Skin Care Tips: ఎండవల్ల మీ ముఖం నల్లగా మారిందా? ఈ టిప్స్ మీకోసమే..
Beauty Tips
Follow us on

Skin Care Tips: మీరు ఎండలో ఎక్కువ సమయం బయట ఉంటున్నారా? అయితే, స్కిన్ టానింగ్ సమస్య వస్తుంది. దీని నుంచి బయటపడేందుకు చాలామంది రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఏవేవో టిప్స్ పాటిస్తుంటారు. ఒక్కోసారి వేలకు వేలు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు. స్టెరాయిడ్ క్రీమ్ సొంతంగా ముఖానికి రాసుకోవడం వల్ల అనేక దుష్ప్రభావాలను ఎదుర్కొంటారు. అలాంటి పరిస్థితిలో సూర్యరశ్మిని ఎలా నిరోధించాలో తెలుసుకోవడం ముఖ్యం. అందుకు నిపుణులు చెప్పే కొన్ని చిట్కాలు పాటిస్తే మేలు జరుగుతుంది. డాక్టర్ల ప్రకారం, ఎండ సమయంలో ఎక్కువ సమయం బయట ఉండటం వలన చర్మం టానింగ్ సమస్య వస్తుంది.

సూర్యుని బలమైన UV కిరణాల నుండి రక్షించడానికి సన్‌స్క్రీన్‌ను ఉపయోగించవచ్చు. అటువంటి సందర్భాలలో, SPF 30 కంటే ఎక్కువ సన్‌స్క్రీన్‌ని ఉపయోగించాలి. ఇది సూర్యుని UV కిరణాల నుండి రక్షిస్తుంది. అయితే చర్మం మరింత సున్నితంగా ఉంటే, SPF 30 కంటే తక్కువ ఉపయోగించండి. అయితే సూర్య కిరణాలకు ఎప్పుడూ దూరంగా ఉండకండి. ఉదయం సమయం కాస్త లేలేత సూర్యకిరణాలు పడేలా కూర్చోవాలి. అయితే, మీ ముఖాన్ని టానింగ్ నుండి రక్షించుకోవాలనుకుంటే, మాస్క్ కప్పుకోవడం ఉత్తమం.

మీ స్వంతంగా ఎలాంటి క్రీమ్‌ను అప్లై చేయవద్దు..

నేటి సోషల్ మీడియా ప్రపంచంలో అందరు అందంగా కనిపించాలని కోరుకుంటారు. అందుకే కొందరు మెడికల్ స్టోర్స్ లో క్రీములు కొని వాటిని రాసుకుని ట్యానింగ్ ను తొలగించుకోవాలని చూస్తుంటారు. ఈ క్రీముల వల్ల కొంత సమయం వరకు ముఖం మెరిసిపోతుంది. కానీ తర్వాత దుష్ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే ఈ క్రీమ్ లో చాలా స్టెరాయిడ్స్ ఉంటాయి. ఇది చర్మంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది.

ముఖాన్ని టానింగ్ నుండి రక్షించుకోవడానికి, ఎండలోకి వెళ్లేటప్పుడు ముఖాన్ని కప్పి ఉంచండి. స్కిన్ హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం. దీని కోసం, రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలి. చర్మంపై టానింగ్ సమస్య పెరుగుతుంటే స్వీయ వైద్యం చేయవద్దు. చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి. కొన్ని ఇంటి నివారణల సహాయంతో కూడా టానింగ్ నుండి బయటపడవచ్చు. దీని కోసం, పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయండి లేదా రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్ ఉపయోగించండి. ఈ పద్ధతిని వారానికి రెండుసార్లు చేస్తే కొంత సమయం తర్వాత ఉపశమనం పొందవచ్చు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏమైనా సమస్యలుంటే నిపుణులను సంప్రందించి వారి సలహాలు, సూచనలు పాటించాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..