పచ్చి కొబ్బరి నెలరోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి…!

కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత వచ్చే అతి పెద్ద సమస్య ఏమిటంటే అది త్వరగా చెడిపోతుంది. కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత 1 నుండి 2 రోజుల్లోనే అవి పాడై దుర్వాసన రావడం ప్రారంభిస్తుంది. రుచి కూడా మారుతుంది. అందుకే దానిని పారవేయాల్సి వస్తుంది. కానీ, కొన్ని సాధారణ చిట్కాలు పాటించి వాటిని నెల రోజుల వరకు తాజాగా ఉంచుకోవచ్చునని మీకు తెలుసా..? అదేలాగో ఇక్కడ చూద్దాం...

పచ్చి కొబ్బరి నెలరోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే.. ఈ సింపుల్‌ ట్రిక్స్‌ ట్రై చేయండి...!
Raw Coconut

Updated on: Jan 15, 2026 | 6:49 PM

పూజలు, పండగలు, ప్రత్యేక రోజుల్లో దేవుడి దగ్గర కొబ్బరి కాయలు ఎక్కువగా కొడుతుంటారు. ఇలా పూజలో కొట్టిన కొబ్బరి ముక్కలు ఎక్కువగా ప్రసాదంతా తినేస్తారు. లేదంటే, వంటలలో ఉపయోగిస్తారు. కానీ, ఒక్కోసారి కొబ్బరి ముక్కలు ఎక్కువగా మిగిలిపోతుంటాయి. కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత వచ్చే అతి పెద్ద సమస్య ఏమిటంటే అది త్వరగా చెడిపోతుంది. కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత 1 నుండి 2 రోజుల్లోనే అవి పాడై దుర్వాసన రావడం ప్రారంభిస్తుంది. రుచి కూడా మారుతుంది. అందుకే దానిని పారవేయాల్సి వస్తుంది. కానీ, కొన్ని సాధారణ చిట్కాలు పాటించి వాటిని నెల రోజుల వరకు తాజాగా ఉంచుకోవచ్చునని మీకు తెలుసా..? అదేలాగో ఇక్కడ చూద్దాం…

మీ ఇంట్లో కొబ్బరికాయ పగలగొట్టిన 2 రోజుల్లోపు బూజు పట్టిన వాసన వస్తుందా..? అయితే, ఈ సింపుల్‌ టిప్స్ మీ కోసమే..ప్రతిరోజూ తాజా పచ్చి కొబ్బరికావాలంటే దొరకదు. రోజూ కొనడం మనకు సాధ్యం కాదు. అటువంటి పరిస్థితిలో మీరు కొన్ని సాధారణ చిట్కాలను గుర్తుంచుకుంటే, కొబ్బరి ఒక నెల పాటు తాజాగా ఉంటుంది. దాని రుచి కూడా చెక్కు చెదర కుండా ఉంటుంది. అదేలాగంటే..

కొబ్బరికాయలు త్వరగా పాడవడానికి కారణం వాటిలోని నీరే. పగిలిన కొబ్బరికాయ గాలికి తగిలినప్పుడు అది త్వరగా బూజు పట్టి దుర్వాసన వస్తుంది. అందుకోసమని చాలా మంది కొబ్బరికాయలను నీటిలో ఉంచుతారు. కానీ, దీనివల్ల అవి జిగటగా ఉంటాయి. అలాంటప్పుడు, పచ్చి కొబ్బరి ముక్కలను ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి దానిని గాలికి తగలకుండా ఉంచాలి. కొబ్బరి ముక్కలను గట్టి కంటైనర్‌లో ఉంచండి. దీనివల్ల గాలి లోపలికి రాకుండా ఉంటుంది. ఇది కొబ్బరికాయను తాజాగా ఉంచుతుంది. బూజు పట్టకుండా నిరోధిస్తుంది.

ఇవి కూడా చదవండి

పగులకొట్టిన కొబ్బరి ముక్కలుగా బదులుగా, మీరు తురిమిన కొబ్బరిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. తురిమిన కొబ్బరిని శుభ్రం చేసి కొద్దిగా ఆరబెట్టండి. తరువాత గాలి చొరబడని కంటైనర్‌లో మూసివేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.

పచ్చి కొబ్బరి ముక్కలు నిల్వ చేయడానికి దానికి కాస్త వేడి చేయని కొబ్బరి నూనె రాయండి. ఇలా చేయడం వల్ల అది బూజు పట్టకుండా ఉంటుంది.

ఇంట్లో కొట్టిన కొబ్బరి ముక్కలు నిల్వ చేయడానికి మీరు దాని పైన ఉప్పు చల్లుకోవచ్చు. ఉప్పులో సహజ యాంటీ మైక్రోబియల్స్ ఉంటాయి. ఇవి ఫంగస్, దుర్వాసన రెండింటినీ నివారిస్తాయి. ఇకపోతే, కొబ్బరి ముక్కలు నిల్వ చేయడానికి పాత్ర శుభ్రంగా ఉండాలి. పాత్రలో నీరు ఉంటే కొబ్బరి త్వరగా చెడిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..