AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pumpkin Seeds: గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం! బీకేర్‌ ఫుల్..

గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విత్తనాలలో విటమిన్ ఎ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి2, ఫోలేట్, బీటా-కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కాబట్టి వీటిని క్రమం..

Pumpkin Seeds: గుమ్మడి విత్తనాలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం! బీకేర్‌ ఫుల్..
గుమ్మడికాయ గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.మెదడు వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తాయి.
Srilakshmi C
|

Updated on: Jun 02, 2025 | 9:37 PM

Share

గుమ్మడికాయ గింజలు ఆరోగ్య ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ విత్తనాలలో విటమిన్ ఎ, ఫైబర్, ఐరన్, కాల్షియం, బి2, ఫోలేట్, బీటా-కెరోటిన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానిక మంచిది. కానీ మంచిదికదాని అతిగా తీసుకుంటే అమృతం కూడా విషంగా మారుతుందని మీరు వినే ఉంటారు. ఈ విషయంలో గుమ్మడికాయ గింజలకు ఎలాంటి మినహాయింపులేదు. వీటిని ఎక్కువగా తినడం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

గుమ్మడి గింజల దుష్ప్రభావాలు ఇవే..

  • ఆరోగ్యానికి మంచి చేసే గుమ్మడి గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల వాటిని అధికంగా తినడం వల్ల కడుపు నొప్పి, విరేచనాలు సంభవిస్తాయని నిపుణులు అంటున్నారు.
  • గుమ్మడి గింజలను అధికంగా తీసుకోవడం వల్ల కొంతమంది బరువు పెరిగే అవకాశం ఉంది.
  • గుమ్మడి గింజలు తినడం వల్ల కొంతమందిలో అలెర్జీలు రావచ్చు. గుమ్మడి గింజల అలెర్జీ ఉంటే, వాటిని తీసుకోవడం తగ్గించడం మంచిది.
  • ఈ విత్తనాలను అధికంగా తీసుకోవడం వల్ల తీవ్రమైన గొంతు నొప్పి, దగ్గు వస్తుంది.
  • గుమ్మడికాయ గింజలను తరచుగా తీసుకోవడం వల్ల కొంతమందిలో రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి ఇప్పటికే తక్కువ రక్తపోటుతో బాధపడుతున్నవారు వీటిని తినకపోవడమే మంచిది.
  • గుమ్మడి గింజలను చిన్న పిల్లలకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ విత్తనాలు పిల్లల గొంతులో చిక్కుకునే అవకాశం ఉంది. పెద్దలు కూడా దీన్ని సరిగ్గా నమిలి, తిని మింగాలి.
  • గుమ్మడికాయ గింజలను సరిగ్గా తీసుకుంటేనే వాటి పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి వీటిని తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సలాడ్లు, గ్రానోలా బార్లు, స్మూతీస్ వంటి ఆహారాల్లో గుమ్మడికాయ గింజలను తీసుకోవచ్చు. వీటిని తేలికగా వేయించి కూడా తీసుకోవచ్చు.

గమనిక: ఈ కంటెంట్‌ సాధారణ సమాచారం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us