Ginger Side Effects: అల్లం ఎక్కువగా వాడితే అనర్థాలే.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పక తెలుసుకోండి..

ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి హాని కలిగించే దుష్ప్రభావాలు కలుగుతాయి. అధికంగా అల్లం తీసుకోవడం వల్ల కడుపు పొరకి చికాకు కలిగిస్తుంది. ఎసిడిటీనని పెంచుతుంది. దీని వలన అసౌకర్యం లేదా గుండెల్లో మంట వస్తుంది. అల్లం గర్భిణీలను లేదా పుట్టబోయే బిడ్డని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి, అల్లం తగ్గించి తినడం, వైద్యుల సలహాతోనే తీసుకోవడం మంచిది.

Ginger Side Effects: అల్లం ఎక్కువగా వాడితే అనర్థాలే.. సైడ్‌ ఎఫెక్ట్స్‌ తప్పక తెలుసుకోండి..
Ginger

Updated on: Oct 05, 2025 | 9:43 PM

అల్లంలో ఫైబర్, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఆరోగ్యకరమైనవి అనేక పోషకాలు ఉన్నాయి. అల్లం జలుబు దగ్గు నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల.. శరీరానికి హాని కలిగించే దుష్ప్రభావాలు కలుగుతాయి. అధికంగా అల్లం తీసుకోవడం వల్ల కడుపు పొరకి చికాకు కలిగిస్తుంది. ఎసిడిటీనని పెంచుతుంది. దీని వలన అసౌకర్యం లేదా గుండెల్లో మంట వస్తుంది.

అల్లం అధికంగా తీసుకోవడం వల్ల బీపీ, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గవచ్చు. ఇది కొందరికి ప్రమాదకరంగా మారుతుంది. అల్లం ఎక్కువగా తింటే గొంతులో గరగర, మంట లేదా మంటగా అనిపించవచ్చు. కొంతమంది అల్లం ఎక్కువగా తీసుకుంటే అలెర్జీ వస్తుంది. చర్మంపై చికాకు, ఎరుపు లేదా దురద వంటివి వస్తాయి. గర్భిణులు అల్లం తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే అధికంగా తీసుకోవడం వల్ల గర్భధారణ సమయంలో ప్రమాదాలు ఏర్పడవచ్చు.

గర్బిణీలు అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తస్రావం పెరుగుతుంది. హార్మోన్ల మార్పులు కూడా ఉంటాయి. అల్లం ఇతర సమస్యలకి కూడా కారణమవుతుందని డాక్టర్ చెబుతున్నారు. అల్లం గర్భిణీలను లేదా పుట్టబోయే బిడ్డని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి, అల్లం తగ్గించి తినడం, వైద్యుల సలహాతోనే తీసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..