శ్రావణ మాసంలో వెల్లుల్లి, ఉల్లి ఎందుకు తినకూడదు..?

చాలా మంది అమ్మాయిలు శ్రావణ మాసంలో మాంసాహారం తినడం, వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం పూర్తిగా మానేస్తారు. ఈ నెలలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినకూడదో మీకు తెలుసా? దీని వెనుక శాస్త్రీయ కారణాలతో పాటు మతపరమైన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

శ్రావణ మాసంలో వెల్లుల్లి, ఉల్లి ఎందుకు తినకూడదు..?
Why Avoid Onion And Garlic In Shravan Maas

Updated on: Jul 20, 2025 | 8:23 PM

శ్రావణ మాసం ఇప్పటికే ప్రారంభమైంది. చాలా మంది ఈ నెలలో ఉపవాసం ఉంటారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు ఈ నెలలో మాంసాహారం తినడం, వెల్లుల్లి, ఉల్లిపాయలు తినడం పూర్తిగా మానేస్తారు. ఈ నెలలో వెల్లుల్లి, ఉల్లిపాయలు ఎందుకు తినకూడదో మీకు తెలుసా? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

మతపరమైన కారణాలు

శ్రావణ మాసం హిందూ మతంలో చాలా పవిత్రమైనది. ఈ సమయంలో శివ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ సమయంలో తామసిక ఆహారం తినకూడదని పెద్దలు చెబుతారు. ఉల్లిపాయలు, వెల్లుల్లిని తామసిక ఆహారంగా పరిగణిస్తారు. కాబట్టి వాటికి దూరంగా ఉండాలని చెబుతారు.

శాస్త్రీయ కారణాలు

ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా శాస్త్రీయంగా ఏం చెబుతున్నారంటే.. శ్రావణ మాసంలో అంటే వర్షాకాలంలో, జీర్ణక్రియ కొద్దిగా బలహీనంగా మారుతుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి ఘాటుగా ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. అందువల్ల, వర్షాకాలంలో వాటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అలాంటి సందర్భాలలో గ్యాస్, వాంతులు, కడుపులో మంట వంటి సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

అంతేకాకుండా ఈ సమయంలో ఆకుపచ్చ కూరగాయలు, వంకాయలను కూడా తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ సీజన్‌లో తేమ కారణంగా వాతావరణంలో బ్యాక్టీరియా ఉంటుంది. దోమలు, కీటకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆకుపచ్చ కూరగాయల్లో స్థావరాలు ఏర్పరచుకుంటాయి. కాబట్టి, వర్షాకాలంలో వీటిని నివారించాలి. అలాగే, వంకాయలు జీర్ణం కావడం కష్టం.

వర్షాకాలంలో తులసి. అల్లం టీ తాగడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ గీతిక అంటున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. దీనితో పాటు బఠానీలు, చిక్‌పీస్ వంటి కొన్ని కూరగాయలను ఈ సీజన్‌లో ఆహారంలో చేర్చుకోవచ్చు. కిచ్డి, గంజి వంటి తేలికపాటి ఆహారాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. దీనితో పాటు ఈ సీజన్‌లో ఆహారాలను తినడానికి ముందు నోటిని రెండు మూడు సార్లు నీటితో బాగా శుభ్రం చేసుకోవడం అవసరం.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.