SHILPA SHETTY: హిప్ ఓపెనింగ్ యోగాసనం.. ఫిట్‌నెస్ ఇన్‌స్పిరేషన్‌తో అదరగొట్టిన శిల్పా శెట్టి

బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి కుంద్రా మళ్లీ తన అభిమానులను ఉత్తేజపరుస్తూ, వారాన్ని ధైర్యంగా ప్రారంభించేలా ఒక అద్భుతమైన యోగా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్ చేసిన శిల్పా, ఒక ప్రత్యేకమైన యోగాసనాన్ని ప్రదర్శించింది. దాని అనేక ప్రయోజనాలను ..

SHILPA SHETTY: హిప్ ఓపెనింగ్ యోగాసనం.. ఫిట్‌నెస్ ఇన్‌స్పిరేషన్‌తో అదరగొట్టిన శిల్పా శెట్టి
Shilpa Shetty

Updated on: Nov 19, 2025 | 12:08 PM

బాలీవుడ్ ఫిట్‌నెస్ ఐకాన్ శిల్పా శెట్టి కుంద్రా మళ్లీ తన అభిమానులను ఉత్తేజపరుస్తూ, వారాన్ని ధైర్యంగా ప్రారంభించేలా ఒక అద్భుతమైన యోగా వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్ చేసిన శిల్పా, ఒక ప్రత్యేకమైన యోగాసనాన్ని ప్రదర్శించింది. దాని అనేక ప్రయోజనాలను వివరించింది. ఈ ఆసనం హిప్ మొబిలిటీని పెంచడం, కాళ్ల సౌలభ్యతను మెరుగుపరచడం, గ్రాయిన్ కండరాలను సక్రియ చేయడం వంటి ప్రయోజనాలతోపాటు, మనసు-శరీర సమన్వయాన్ని కూడా బలోపేతం చేస్తుందని శిల్పా తెలిపింది.

వీడియోలో శిల్పా ఈ హిప్ ఓపెనింగ్ ఆసనాన్ని చేస్తూ కనిపించింది. ఈ ఆసనం ద్వారా కాళ్లు, మోకాళ్లు, పెల్విక్ కండరాలు బలోపేతమవుతాయి. ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారిలో వచ్చే స్టిఫ్‌నెస్‌ను తొలగిస్తుంది. అంతేకాదు, బ్యాలెన్స్, ఫోకస్, అవగాహన పెంచి, మైండ్-బాడీ కోఆర్డినేషన్‌ను మెరుగుపరుస్తుంది. కానీ, ఎప్పటిలాగే సేఫ్టీని శిల్పా మరచిపోలేదు. వెన్నునొప్పి, స్లిప్ డిస్క్ సమస్యలు లేదా మోకాలి గాయాలు ఉన్నవారు ఈ ఆసనాన్ని ప్రయత్నించవద్దని హెచ్చరించింది.

“Holding an Asana and letting the energy align” అని ఆ వీడియోకు ట్యాగ్ చేసింది. తర్వాత తన సిగ్నేచర్ హ్యాష్‌ట్యాగ్‌లు #MondayMotivation, #SwasthRahoMastRaho, #FitIndia, #YogaSeHiHoga వంటివి కలిపి షేర్ చేసింది. ఈ పోస్ట్ కేవలం యోగా డెమో మాత్రమే కాదు. శక్తిని సమన్వయం చేసుకునేలా చేసే మెసేజ్‌ కూడా.

ఇటీవల శిల్పా చేసిన మొబిలిటీ చాలెంజ్ తర్వాత వచ్చిన మొదటి పోస్ట్. ఆ చాలెంజ్‌లో ఆమె వెనుకవైపు ఉంచిన డంబెల్‌ను ఒక చేత్తో ఎత్తే ప్రయత్నం చేసింది. మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయినప్పటికీ, రెండోసారి సక్సెస్ అయింది. “Looks easy… until you actually try it! Now it’s your turn” అని అభిమానులను ఛాలెంజ్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.