
ప్రతి ఒక్కరూ అందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా మిలమిలా మెరిసే చర్మం కోసం ప్రతి ఒక్కరూ తహతహలాడతారు. స్కిన్ కేర్ కోసం ఖరీదైన ఉత్పత్తులతో పాటు వంటింటి చిట్కాలను కూడా ఉపయోగిస్తారు. అలా అందమైన చర్మం కోసం ఉపయోగించే వాటిల్లో ఒకటి రోజ్ వాటర్. చర్మం మెరుస్తూ ఉండడం కోసం దీనిని స్కిన్ టోనర్ గా ఉపయోగిస్తారు. కొంతమంది రోజ్ వాటర్ లో ముల్తానీ మిట్టి , చందనం వంటి వాటిని కలిఫై ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటారు.
రోజ్ వాటర్ అందాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీన్ని అప్లై చేయడం వల్ల చర్మం చల్లబడుతుంది. సన్ టానింగ్, ముఖం మీద మొటిమల నుంచి ఉపశమనం కోసం కూడా రోజ్ వాటర్ ని ఉపయోగిస్తారు. చర్మాన్ని మాయిశ్చరైజింగ్ గా ఉండేలా రోజ్ వాటర్ పని చేస్తుంది. అయితే రోజ్ వాటర్‌ని అన్ని రకాల ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించలేరు. ఎందుకంటే రోజ్ వాటర్‌తో కొన్ని రకాల పదార్ధాలను కలిపితే చర్మానికి ప్రయోజనానికి బదులు హాని కలిగిస్తుంది. ఈ రోజు రోజ్ వాటర్ తో కలిపి పొరపాటున కూడా వీటిని కలిపి అప్లై చేయవద్దు. అవి ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
బేకింగ్ సోడా, రోజ్ వాటర్ రెండూ సహజమైన పదార్థాలే అయినప్పటికీ.. రెండింటి స్వభావం కారణంగా వీటిని మిక్స్ చేసి అప్లై చేయకూడదు. ఎందుకంటే వీటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల రియాక్షన్ వస్తుంది. ఈ మిశ్రమం ముఖం మీద డల్‌నెస్, దద్దుర్లు వంటి సమస్యలను కలిగిస్తుంది.
నిమ్మ రసం, రోజ్ వాటర్ రెండూ చర్మ సంరక్షణకు ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటిని మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల దుష్ప్రభావాలుంటాయి. ఈ మిశ్రమం చర్మ సమస్యలు, పొడిబారడానికి కారణమవుతుంది.
కొంతమంది రోజ్ వాటర్ , ఎసెన్షియల్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తారు. దీని కారణంగా చర్మం దురద, చికాకు సమస్యలు ఏర్పడవచ్చు. ముఖ్యంగా ఎవరి చర్మం సెన్సిటివ్‌గా ఉంటే ఎసెన్షియల్ ఆయిల్, రోజ్ వాటర్‌ని కలిపి అస్సలు ఉపయోగించకూడదు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..