Relationship: మీ పార్ట్‌నర్ దగ్గర ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. రిలేషన్ డ్యామేజ్ అయినట్లే.. అవేంటో తెలుసుకోండి..

|

Jul 23, 2022 | 4:20 PM

Relationship Mistakes: ఈ నమ్మకం ఇద్దరి మధ్య లోపాలను అధిగమించేందుకు సహాయపడుతుంది. అయితే, చాలామంది భాగస్వామి అభిప్రాయాలను, భావాలను చాలా లైట్‌గా తీసుకుంటుంటారు.

Relationship: మీ పార్ట్‌నర్ దగ్గర ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. రిలేషన్ డ్యామేజ్ అయినట్లే.. అవేంటో తెలుసుకోండి..
Relationship Tips
Follow us on

ఇద్దరి మధ్య బంధం గట్టిపడాలంటే, కచ్చితంగా ఒకరినొకరు పూర్తిగా తెలుసుకోవాల్సిందే. లేదంటే, రిలేషన్ డ్యామేజ్‌లో పడిపోద్ది. ఏ విషయమైనా ఇద్దరు చర్చించుకుని, ఇద్దరి అభిప్రాయాలకు, భావాలకు గౌరవం ఇచ్చి పుచ్చుకుంటేనే, ఆ బంధం చాలా స్ట్రాంగ్‌గా మారిపోతుంది. అలా కాకుండా ప్రతి చిన్నవిషయాన్ని చాలా సింపుల్‌గా తీసుకుని, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ముఖ్యంగా ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. ఆడా, మగ మధ్య సంబంధం నమ్మకం, పరస్పర అవగాహనపైనే ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే ఇద్దరి మధ్య వచ్చే ఏ టాపిక్ అయినా చాలా విషయాలతో ముడిపడి ఉంటుంది. ఇందులో తెలివిగా రాణించేలా తప్ప, తప్పుకోవాలని ప్రయత్నిస్తే, బంధం బీటలువారే ఛాన్స్ ఉంటుంది.
  2. ఈ నమ్మకం వారిద్దరి మధ్య లోపాలను అధిగమించేందుకు సహాయపడుతుంది. అయితే, చాలామంది భాగస్వామి అభిప్రాయాలను, భావాలను చాలా లైట్‌గా తీసుకుంటుంటారు. ఇలాంటి వాటితో భాగస్వామి హృదయం గాయపడుతుంది.
  3. మీరు మీ భాగస్వామికి ఉన్న ఏదైనా అలవాటును అందరి ముందు ఎగతాళి చేయడం వల్ల, వారు చాలా బాధపడతారు.
  4. అలాగే ఏదైనా వాగ్దానం చేసి, ఆ మరుసటి నిముషమే దానిని మర్చిపోవడం కూడా భాగస్వామికి తీవ్రమైన బాధను మిగుల్చుతుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తొలుత కలిసి తీసుకున్న నిర్ణయమైనా.. ఆ తర్వాత భాగస్వామి అభిప్రాయలను లెక్కచేయకుండా ప్రవర్తించినా సరే.. అది కూడా రిలేషన్‌షిప్‌లో దూరాన్ని పెంచుతుంది.
  7. ఇద్దరిమధ్య వచ్చే ఏ విషయమైనా సరే.. భాగస్వామి ఇష్టాలు, అయిష్టాలను పక్కన పెడితే, ఎనలేని బాధను మిగిల్చే అవకాశం ఉంది.
  8. వీటితోపాటు భావాలను భాగస్వామితో పంచుకోకపోయినా సరే ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంటుంది.
  9. గతంలో జరిగిన ఏ విషయమైనా అంతటితోనే వదిలేయాలి. అలా కాకుండా, పదే పదే ఆ విషయం గురించే మాట్లాడడం వల్ల భాగస్వామి ఇబ్బందిగా ఫీలయ్యే ఛాన్స్ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఎక్కువగా అవుతుంది.
  10. తప్పించుకోవడానికి నాకు గుర్తులేదు, మచ్చిపోయా లాంటి మాటలు కూడా భాగస్వామిని ఇబ్బందులకు గురి చేస్తాయి. వీటితో పాటు భాగస్వామి స్పెషల్ డేట్స్ మర్చిపోతే మాత్రం ఎంతో ఫీలవుతారు. అందుకే ఇలాంటి విషయాలపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తే, ఇద్దరి మధ్య రిలేషన్ చాలా బాగుటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.