కొవిడ్ నుంచి కోలుకున్నవారు.. టీకా వేసుకున్నవారు.. ఈ టెస్ట్‌ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే..?

|

May 21, 2021 | 2:28 PM

About These Tests : ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

కొవిడ్ నుంచి కోలుకున్నవారు.. టీకా వేసుకున్నవారు.. ఈ టెస్ట్‌ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే..?
About These Tests
Follow us on

About These Tests : ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తుంది. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. చాలామంది మరణిస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. అత్యవసర పేషెంట్లకు ఆక్సిజన్ అందడం లేదు. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం కరోనా కేసుల నుంచి రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. అయితే నెగిటివ్ వచ్చిన వారు, కరోనా టీకా వేసుకున్న వారు ఈ టెస్ట్‌ల గురించి తెలుసుకోవాలి.

1. విటమిన్ డి పరీక్ష: విటమిన్ డి మన బాడీలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రికవరీ సమయంలో విటమిన్ డి భర్తీ చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. కనుక కరోనా నుంచి కోలుకున్న వారు కచ్చితంగా విటమిన్ డి టెస్టు చేయించుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీ బాడీలో ఏదైనా లోపం ఉంటే సరిచేయడంలో ఇది సహాయపడుతుంది.

2. పోస్ట్-కోవిడ్ టెస్టు: మన బాడీలో ఉండే రోగ నిరోధక వ్యవస్థ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది. అయితే SARS, COV-2 వైరస్ వైరల్ లోడ్ క్షీణించిన తర్వాత చాలా కాలం పాటు దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయి. వైరస్ బాడీలోని అనేక ముఖ్యమైన భాగాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయితే వైరస్ ద్వారా మీ బాడీ ఎంతవరకు ప్రభావితమవుతుందో తెలుస్తుంది.

3. కార్డియాక్ స్క్రీనింగ్స్: కొవిడ్ సోకిన వారి బాడీలో కొన్నిసార్లు మంటగా అనిపిస్తుంది. దీని వల్ల గుండె కండరాలు, అరిథ్మియా బలహీనపడటం, దెబ్బతినడం వంటివి జరుగుతాయి. ఇదివరకే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి దీని వల్ల సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

4. గ్లూకోజ్, కొలెస్ట్రాల్ టెస్టులు: వైరస్ వల్ల మీ బాడీలో రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంటుంది. టైప్-1, టైప్-2 డయాబెటిస్, కొలెస్ట్రాల్ , గుండె సంబంధిత వ్యాధులు కలిగిన వారు కూడా రికవరీ అనంతరం ఈ టెస్టులను చేయించుకోవాలి. ఎందుకంటే కరోనా రికవరీ తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ మారే అవకాశం ఉంటుంది.

5. యాంటీ బాడీ టెస్టులు: కరోనా తర్వాత మీ బాడీ అంటువ్యాధులను నివారించే సహాయక ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. యాంటీ బాడీ స్థాయిని నిర్ణయించడం వల్ల మీరు ఎంత రోగనిరోధక శక్తి కలిగి ఉన్నారనేది తెలుస్తుంది. మరోవైపు మీరు ప్లాస్మా దానానికి అర్హులు అయితే అందుకు కూడా సహాయపడుతుంది.

Tv9

sonu sood: పాన్ ఇండియా మూవీలో హీరోగా సోనూసూద్.. డైరెక్ట్ చేయబోతున్న టాలీవుడ్ డైనమిక్ డైరెక్టర్…

Anandayya corona medicine : నెల్లూరు ఆయుర్వేద కరోనా మందు అధ్యయనానికి ICMR బృందాన్ని పంపాలని కోరిన సీఎం జగన్

Tarun Tejpal: అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న తెహెల్కా మాజీ చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటించిన గోవా జిల్లా కోర్టు!