Ramadan 2022: ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఖర్జూరంతోనే ఉపవాసం విరమిస్తారు.. కారణమేంటో తెలుసా?

| Edited By: Shaik Madar Saheb

Apr 02, 2022 | 3:07 AM

Ramadan 2022: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఏప్రిల్ 3 లేదా 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీంతో ముస్లింలు రోజా ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. కాగా ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది.

Ramadan 2022: ఈ పవిత్ర మాసంలో ముస్లింలు ఖర్జూరంతోనే ఉపవాసం విరమిస్తారు.. కారణమేంటో తెలుసా?
Ramadan 2022
Follow us on

Ramadan 2022: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఏప్రిల్ 3 లేదా 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీంతో ముస్లింలు రోజా ఏర్పాట్లలో నిమగ్నమవుతున్నారు. కాగా ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపై అవతరించింది. దీనికి ప్రతీకగానే ఈ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలను పాటిస్తారు. చిన్న, పెద్ద, ముసలి అనే తారతమ్యం లేకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు భక్తి శ్రద్ధలతో ఈ ఉపవాస దీక్షను ఆచరిస్తారు. ఈ సమయంలో నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగ కుండా ఉంటారు. ఇలా ఉపవాస దీక్షలు చేయడం వల్ల ఆకలి విలువ తెలియడంతో పాటు జీవక్రియ రేటు పెరుగుతుందని నమ్మకం. మొత్తం 30 రోజుల పాటు సాగే ఈ దీక్షలో సూర్యోదయానికి ముందు ఉదయం పూట సహరీ చేస్తారు. అలాగే సాయంత్రం ఉపవాస దీక్ష ముగించి ఇఫ్తార్ చేస్తారు. కాగా ఇఫ్తార్‌ సమయంలో ఖర్జూరం తీసుకునే ఉపవాస దీక్ష విరమిస్తారు ముస్లింలు.. మరి ఇలా ఖర్జూరం తినడం వెనక మతలబు ఏమిటి? దాని ల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం రండి.

ఖర్జూరంతోనే ఎందుకంటే..

ఇస్లాం ప్రవక్త హజ్రత్ మహ్మద్ సాహిబ్‌ కు ఖర్జూరమంటే చాలా ఇష్టమని ముస్లింల నమ్మకం. అతను ఈ పండుతోనే ఉపవాసం విరమించేవాడట. అందుకే ముస్లింలు కూడా ఖర్జూరంతోనే ఉపవాస దీక్షను ముగిస్తారు. అయితే ఈ నమ్మకం, విశ్వాసాల సంగతి పక్కన పెడితే.. ఖర్జూరం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ఈ మాసంలో ముస్లింలు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చాలా సమయం పాటు ఉపవాసంతో ఉంటారు. ఇలాంటప్పుడు ఏవి పడితే అవి తింటే జీర్ణక్రియ సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే ఖర్జూరం తీసుకోవడం వల్ల ఎలాంటి జీర్ణక్రియ సమస్యలు ఎదురుకావు. అందుకే ప్రతిరోజూ సాయంత్రం ఇఫ్తార్‌ సమయంలో ఖర్జూరంను తప్పకుండా తీసుకుంటారు ముస్లింలు.

ఖర్జూరంతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటే..

*ఖర్జూరంలో ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. అదేవిధంగా ఎముకలకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తాయి.

*ఖర్జూరంలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకు చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా కంటి చూపును మెరుగుపరచడంలో, కంటి సమస్యలను తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.

* ఈ పండులో ప్రొటీన్లు, ఐరన్ తో పాటు పలు రకాల విటమిన్లు ఉంటాయి. ఇవి ఉపవాస సమయంలో ఎనర్జిటిక్‌గా ఉండడానికి సహాయ పడతాయి. ఇక ఇందులోని ప్రొటీన్ కండరాలను బలంగా ఉంచుతుంది. అంతేకాదు ఖర్జూరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

*ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. అదేవిధంగా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

* ఇందులో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతాయి.

*ఖర్జూరంలో ఫైబర్ ఉండడం వల్ల దీనిని తినగానే చాలా సేపటి వరకు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. అందుకు బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఆహారమని వైద్య నిపుణులు సూచిస్తారు.

*ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు విరివిగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Note: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. TV9 వీటిని ధ్రువీకరించడం లేదు. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని అనుసరించండి

Also Read:Viral Video: వీడి దుంప తెగ..! వాటర్ బెలూన్ తో ఆటోని పడగొట్టిన ఘనత వీడితే.. ఎం అనాలో మరి వీడిని..
Andhra Pradesh: ఏసీలు, వాషింగ్ మిషన్లు వాడొద్దు.. ప్రజలకు AP SPDCL విజ్ఞప్తి

Krish- Trivikram: పక్క ప్లాన్ తో రాబోతున్న స్టార్ దర్శకులు.. ఒకరు అలా మరొకరు ఇలా