Protein Rich Fruits: శరీర నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం.. ఈ ఫ్రూట్స్ ని తినే ఆహరంలో చేర్చుకోండి.. ప్రోటీన్లు పుష్కలం..

|

Jun 07, 2024 | 10:12 AM

కొన్నిసార్లు శరీరంలో దాని లోపం కారణంగా.. అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చర్మం, జుట్టు, ఎముకలు, గోర్లు, శరీర కణాలు, కండరాలు, అవయవాల పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా అవసరం కనుక తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కనుక ఈ రోజు ప్రోటీన్ పుష్కలంగా ఉండే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.. వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన శరీరానికి ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

Protein Rich Fruits: శరీర నిర్మాణానికి ప్రోటీన్లు అవసరం.. ఈ ఫ్రూట్స్ ని తినే ఆహరంలో చేర్చుకోండి.. ప్రోటీన్లు పుష్కలం..
Protein Rich Fruits
Image Credit source: pexels
Follow us on

శరీర నిర్మాణంలో ముఖ్యమైన పదార్ధాల్లో ఒకటి మాంసకృత్తులు. వీటినే ప్రోటీన్లు అని కూడా అంటారు. ఇవి శరీరం సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. శరీరంలో ప్రోటీన్ల లోపం ఉంటే అనేక ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. కండరాల బలం నుంచి పొడవాటి జుట్టు, మెరుస్తున్న చర్మం వరకు అనేక విధాలుగా ప్రోటీన్లు శరీరానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి. అదే సమయంలో..ప్రోటీన్ల ఎముకలు ధృడ బలపరుస్తుంది. కానీ కొన్నిసార్లు శరీరంలో దాని లోపం కారణంగా.. అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చర్మం, జుట్టు, ఎముకలు, గోర్లు, శరీర కణాలు, కండరాలు, అవయవాల పరిపూర్ణ ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా అవసరం కనుక తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కనుక ఈ రోజు ప్రోటీన్ పుష్కలంగా ఉండే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.. వీటిని మీ డైట్‌లో చేర్చుకోవడం వలన శరీరానికి ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి.

జామ: ప్రొటీన్ల లభ్యత విషయంలో జామ పండ్లలో మొదటి స్థానంలో ఉంటుంది. ఒక గిన్నె జామ పండు ముక్కల్లో కనీసం 4.2 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. మాంసకృత్తులు సమృద్ధిగా ఉండటమే కాదు విటమిన్ సి, ఫైబర్ నిధిగా జామకాయ పరిగణింపబడుతున్నది.

అవకాడో: ఒక కప్పు అవకాడో ముక్కల్లో సుమారు 3 గ్రాముల ప్రోటీన్లను పొందుతారు. అయితే అవకాడో గుజ్జులో 4.6 గ్రాముల ప్రోటీన్లు ఉంటుంది. ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ఇందులో ప్రొటీన్‌తో పాటు కొవ్వు, పీచు, పొటాషియం వంటి పోషకాలు కూడా లభిస్తాయి. ఈ పోషకాల కారణంగా ఆలోచించకుండా తినే ఆహారంలో అవకడోని చేర్చుకోవచ్చు, దీనితో పాటు బరువు తగ్గాలనుకునే వారికి అవకాడో బెస్ట్ ఫ్రూట్..

ఇవి కూడా చదవండి

కివి:
ఒక కప్పు కివీ ముక్కల్లో రెండు గ్రాముల ప్రొటీన్లను ఉంటాయి. అయితే కివీని తొక్కతో లేదా తొక్క తీసి లేకుండా కివీని తినవచ్చు. తినడానికి ముందు.. కివీని పూర్తిగా శుభ్రం చేశారని నిర్ధారించుకోవాలి. ఈ పుల్లటి పండులో ప్రొటీన్లతో పాటు విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. ప్రోటీన్లు, విటమిన్ సి రెండూ బరువు తగ్గడంలో సహాయపడతాయి.

బ్లాక్ బెర్రీ, రాస్ప్‌బెర్రీ: అన్ని బెర్రీలు ప్రోటీన్ల ములకాలు కాదు. అయితే బ్లాక్ బెర్రీ, రాస్ప్‌బెర్రీలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు బ్లాక్‌బెర్రీస్‌లో రెండు గ్రాముల ప్రొటీన్‌లు ఉంటాయి. అయితే ఒక కప్పు రాస్ప్‌బెర్రీస్‌ 1.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ పండ్లు శరీరంలోని రోజువారీ ప్రోటీన్ల లోపాన్ని తీరుస్తాయి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..