Beauty Tips: బ్యూటీ పార్లర్లకు వెళ్లే పనిలేదు.. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.. ముఖం అద్దంగా మెరవాల్సిందే!

ఈ మధ్య కాలంలో మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే పెద్ద ఏజ్ వారిలా కనిపిస్తున్నారు. ఈ సమస్యను అదిగించేందుకు చాలా మంది రకరకాల క్రీమ్స్ వాడుతున్నారు. కాని పూర్తి పరిష్కారం పొందలేకపోతున్నారు. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టే అందంగా కనిపించే చర్మం ఎలా పొందాలో అని అనస్థీషియాలజిస్ట్, ఇంటర్వెన్షనల్ పెయిన్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్ కునాల్ సూద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిట్కాను పంచుకున్నాడు. అదేంటో తెలుసుకుందాం పదండి.

Beauty Tips: బ్యూటీ పార్లర్లకు వెళ్లే పనిలేదు.. ఈ సింపుల్‌ టిప్స్‌ పాటిస్తే చాలు.. ముఖం అద్దంగా మెరవాల్సిందే!
How To Get Youthful Skin

Updated on: Jan 02, 2026 | 5:56 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న వయస్సులోనే పెద్దవారిలా కనిపిస్తున్నారు. చాలా మంది ఇది జన్యుశాస్త్రం లేదా రెగ్యులర్‌గా యూజ్ చేసే క్రీముల వల్ల అనుకుంటారు. కానీ మన రోజువారి అలవాల్లు కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మీరు మీ చర్మాన్ని సూర్మరశ్మి నుంచి ఎలా కాపాడుకుంటారు, ఎంత సమయం నిద్రపోతారు, ఎంత నీరు త్రాగుతారు, మీ ఒత్తిడిని ఎలా నిర్వహిస్తారు అనే అంశాలన్ని మీ చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి మీరు చర్మం సహజంగా యవ్వనంగానే కనిపించాలంటే ఈ రోజువారి అలవాట్లను మార్చుకోండి.

చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుకునేందుకు డాక్టర్ చెప్పిన 6 రోజువారీ అలవాట్ల

ఇవి కూడా చదవండి

సన్‌స్క్రీన్‌ అప్లై చేయడం:

డాక్టర్ సూద్ ప్రకారం మన చర్మాన్ని రక్షించుకునేందుకు సన్‌స్క్రీన్‌ను ప్రతిరోజూ వాడడం ముఖ్యం. మీరు సన్‌స్క్రీన్‌ను వాడడం వల్ల చర్మ వ్యాధులను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎలా అంటే సన్‌స్క్రీన్ UVA కిరణాల నుండి వచ్చే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇది కొల్లాజెన్‌ను దెబ్బతీసి మీ చర్చం ముడతలు, మాడిపోకుండా రక్షిస్తుంది.

ధూమపానం మానేయండి:

డాక్టర్ సూద్ ప్రకారం, ధూమపానం అనే చర్మ వృద్ధాప్యాన్ని త్వరగా పెంచుతుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఉన్న కొల్లాజెన్‌ను విచ్ఛిన్నం చేస్తుంది. అలాగే చర్మాన్ని దెబ్బతీస్తుంది. తక్కువ సూర్యరశ్మి ఉన్నప్పటికీ ధూమపానం చేసేవారికి చర్మంపై ఎక్కువ ముడతలు వస్తాయని ఆయన తెలిపారు. ఒక వేళ మీరు దూమపానం మానేస్తే చాలా త్వరగా మార్పును గమనిస్తారు.

ఆల్కహాల్‌ తగ్గించడం

అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చర్మం వృద్ధాప్యం వేగవంతం అవుతుంది. ఇది మంట, నిర్జలీకరణాన్ని పెంచుతుంది అలాగే చర్మాన్ని దెబ్బతీస్తుంది. అధికంగా మద్యం సేవించేవారిలో తరచుగా లోతైన ముడతలు, ముఖం వాపు, కనిపించే సిరలు, ముఖం కుంగిపోవడం జరుగుతుందని డాక్టర్ సూద్ వివరించారు. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం వల్ల చర్మం తేమను పెరిగి, కొల్లాజెన్ నష్టం తగ్గుతుందని ఆయన తెలిపారు.

ఒత్తిడిని నియంత్రించండి.

నిరంతర ఒత్తిడి హార్మోన్లకు అంతరాయం కలిగిస్తుంది. అలాగే చర్మాన్ని లోపలి నుండి దెబ్బతీస్తుంది. డాక్టర్ సూద్ ప్రకారం, అధిక ఒత్తిడి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది, చర్మాన్ని బలహీనపరుస్తుంది. దీని వల్ల మీ ముఖంలో వృద్ధాప్య సంకేతాలు ముందుగానే కనిపిస్తాయి. ఒత్తిడిని తగ్గించడం వల్ల చర్మ ఆకృతిని మెరుగుపరుచుకొని.. తేమను పెంచుకోవచ్చు. ఇది మీ చర్మం ప్రకాశంగా మెరిసేందుకు సహాయపడుతుంది.

నీరు ఎక్కువగా తాగండి.

నీరు ఎక్కువగా తాగడం వల్ల మీ చర్మం మరింత హైడ్రేటెడ్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉంటుందని డాక్టర్ సూద్ అంటున్నారు. తక్కువ నీరు ఎక్కువగా తాగే వారికి ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. మంచి హైడ్రేషన్ పొడిబారడాన్ని తగ్గిస్తుంది, ముడతల రూపాన్ని తగ్గిస్తుంది.


గమనిక: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు. వీటిని ఉపయోగించే ముందు మీరు కచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.