ఈ కూరగాయతో మొలల వ్యాధికి గుడ్ బై.. ఆరోగ్యానికి అమృతం..! లాభాలు తెలిస్తే..

ముల్లంగి ఎక్కువగా సాంబార్‌లలో వినియోగిస్తుంటారు. అయితే ముల్లంగి వలన టేస్ట్ బాగుండటమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంట. ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా దీనిని చలికాలంలో తినడం వలన ఇది శరీరానికి చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు.ముల్లంగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మలబద్దకం, మొలలు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారికి ముల్లంగి దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

ఈ కూరగాయతో మొలల వ్యాధికి గుడ్ బై.. ఆరోగ్యానికి అమృతం..! లాభాలు తెలిస్తే..
Radish

Updated on: Nov 16, 2025 | 10:10 PM

మొలలు, వీటినే హెమోరాయిడ్స్ అని కూడా అంటారు. ఇవి మలద్వారం, పురీషనాళం లోపల వాపు, నొప్పి, రక్తస్రావం కలిగించే సిరలు. ఈ సమస్య ఉన్నవారు చాలా ఇబ్బందిపడుతుంటారు. కూర్చోవడం, నడవడం, చివరికి మలవిసర్జన చేయడం కూడా కష్టంగా మారుతుంది. అయితే, శుభవార్త ఏమిటంటే, మనకు ప్రకృతి ప్రసాదించిన ముల్లంగి ఈ సమస్యకు ఒక సహజ పరిష్కారం.

మొలల సమస్యతో బాధపడేవారికి ముల్లంగి ఒక వరం లాంటిది. దీనిని సరైన పద్ధతిలో ఉపయోగించడం ద్వారా మొలల వల్ల కలిగే బాధల నుండి సహజంగా ఉపశమనం పొందవచ్చు. ముల్లంగిలోని గుణాలు మొలల వల్ల కలిగే వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. తద్వారా మలబద్ధకం, మొలల సమస్యలు రాకుండా చూస్తుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు ముల్లంగి రసం తాగడం వల్ల మొలల సమస్య తగ్గుతుంది. ముల్లంగిని సన్నగా తురిమి, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీరతో కలిపి తీసుకోవచ్చు.

ముల్లంగిలో అధిక మొత్తంలో పీచుపదార్థం ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలం సులభంగా కదిలేలా చేస్తుంది. తద్వారా మొలలపై ఒత్తిడి తగ్గుతుంది. దీనిలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ముల్లంగి రసం రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడుతుంది. అయితే, సరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ముల్లంగితో కూర, పచ్చడి వంటివి తయారుచేసుకొని ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. అంతే కాకుండా వీటిని మెత్తగా పేస్ట్ చేసి, మొలలపై రాయడం వలన నొప్పి , వాపు తగ్గుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us