Period Acne: పీరియడ్స్ ముందు తర్వాత ముఖంపై మొటిమలు ఎందుకు వస్తాయి?

|

Apr 02, 2024 | 8:31 PM

పీరియడ్స్ సమయంలో శరీరంలోని హార్మోన్లలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. దీని కారణంగా మహిళలు కొన్నిసార్లు తీవ్రమైన మానసిక కల్లోలానికి గురవుతారు. పీరియడ్స్‌కు ముందు, తరువాత కడుపు నొప్పి, వెన్నునొప్పి, శరీర తిమ్మిరి, తలనొప్పి, కాళ్ళలో వాపు, భయం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. దీనితో పాటు ఈ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల మార్పులు కూడా కనిపిస్తాయి. పీరియడ్స్ అనేది ప్రతి నెలా వచ్చే సహజ ప్రక్రియ. కొందరిలో ఆలస్యంగా వస్తుంది. మరికొందరిలో తొందరగా వస్తుంది. అన్ని సమస్యలతో పాటు, పీరియడ్స్‌కు ముందు, తర్వాత..

Period Acne: పీరియడ్స్ ముందు తర్వాత ముఖంపై మొటిమలు ఎందుకు వస్తాయి?
Period Acne
Follow us on

పీరియడ్స్ సమయంలో శరీరంలోని హార్మోన్లలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. దీని కారణంగా మహిళలు కొన్నిసార్లు తీవ్రమైన మానసిక కల్లోలానికి గురవుతారు. పీరియడ్స్‌కు ముందు, తరువాత కడుపు నొప్పి, వెన్నునొప్పి, శరీర తిమ్మిరి, తలనొప్పి, కాళ్ళలో వాపు, భయం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. దీనితో పాటు ఈ సమయంలో మహిళల శరీరంలో అనేక రకాల మార్పులు కూడా కనిపిస్తాయి. పీరియడ్స్ అనేది ప్రతి నెలా వచ్చే సహజ ప్రక్రియ. కొందరిలో ఆలస్యంగా వస్తుంది. మరికొందరిలో తొందరగా వస్తుంది. అన్ని సమస్యలతో పాటు, పీరియడ్స్‌కు ముందు, తర్వాత ప్రతిసారీ మహిళల ముఖాలపై మొటిమలు కనిపించడం ప్రారంభిస్తాయి. పీరియడ్స్ – మొటిమలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఎందకు వస్తాయి? అనే సందేహం చాలా మందికి వస్తుంది. ఆ వివరాలు మీ కోసం..

ముఖంపై మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో అమ్మాయిల శరీరంలో వాపు పెరుగుతుంది. దీని కారణంగా ముఖంలో దురద ఏర్పడుతుంది. ఇది మొటిమలు వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఇది కాకుండా పీరియడ్స్ సమయంలో ఆండ్రోజెన్ అనే హార్మోన్ శరీరంలో పెరుగుతుంది. దీని కారణంగా ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. ముఖ్యంగా పీరియడ్స్ ప్రారంభానికి ముందు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. దీని కారణంగా ముఖంపై మొటిమలు కనిపిస్తాయి. అదే సమయంలో కొంతమంది ఈ సమయంలో చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటారు. దాని కారణంగా మొటిమల సమస్య మరింత పెరుగుతుంది.

పీరియడ్స్ సమయంలో ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవేంటంటే.. పీరియడ్స్ రాకముందే మహిళల టైమ్ టేబుల్‌లో చాలా మార్పులు చోసుకోవాలి. ఈ సమయంలో సరిగ్గా తినలేరు. ప్రశాంతంగా నిద్రపోలేరు. అకస్మాత్తుగా జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా వారికి మొటిమలు కూడా వస్తాయి. పీరియడ్స్ సమయంలో మహిళలు జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, సిగరెట్లకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో వీటిని తిన్నా, తాగినా మొటిమల సమస్య రావడం గ్యారెంటీ.

ఇవి కూడా చదవండి

కొంతమంది మహిళలు పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపు నొప్పిని అనుభవిస్తారు. ఈ నొప్పిని తగ్గించడానికి, మహిళలు పీరియడ్స్ సమయంలో పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఈ మందుల వల్ల కూడా చాలా సార్లు మొటిమలు వస్తాయి. ఈ సమయంలో కడుపు నొప్పి ఉంటే, మందులకు బదులుగా కొన్ని ఇంటి నివారణల చిట్కాలు పాటించవచ్చు. దీని ద్వారా సులువుగా పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ సమయంలో సోపు తినవచ్చు. అలాగే అల్లం టీ తాగవచ్చు. వ్యాయామం చేయవచ్చు. వేడి నీటిని సేవించవచ్చు.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.