Summer Skincare Tips: ఎండాకాలంలో చర్మం జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడి వేడికి ఆరోగ్యంతోపాటు చర్మాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాతావరణానికి అనుగుణంగా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చలికాలంలో చర్మం పొడిబారినట్లు అవుతుంది. అదేవిధంగా వేసవిలో మండే ఎండలు, తేమ, వేడి కారణంగా ముఖం జిగటగా మారుతుంది. చెమట, నూనె రెండూ చర్మంపై పేరుకుపోయి జిడ్డుగా కనిపిస్తుంది. దీంతో రోజంతా దుమ్ము, ధూళి ముఖంపై పేరుకుపోతుంది. ఫలితంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్య ఏర్పడి ముఖం డల్‌గా కనబడుతుంది. ఈ సమస్యను నివారించడానికి..
ఎండాకాలం వచ్చేసింది. సూర్యుడి వేడికి ఆరోగ్యంతోపాటు చర్మాన్ని కూడా ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాతావరణానికి అనుగుణంగా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చలికాలంలో చర్మం పొడిబారినట్లు అవుతుంది. అదేవిధంగా వేసవిలో మండే ఎండలు, తేమ, వేడి కారణంగా ముఖం జిగటగా మారుతుంది. చెమట, నూనె రెండూ చర్మంపై పేరుకుపోయి జిడ్డుగా కనిపిస్తుంది. దీంతో రోజంతా దుమ్ము, ధూళి ముఖంపై పేరుకుపోతుంది. ఫలితంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్ సమస్య ఏర్పడి ముఖం డల్‌గా కనబడుతుంది. ఈ సమస్యను నివారించడానికి అనేక రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా జిడ్డు చర్మతత్వం కలిగిన వారు వేసవిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, తద్వారా మొటిమలు, బ్లాక్ హెడ్స్, డల్ స్కిన్ వంటి సమస్యలను నివారించవచ్చు. అలాగే వేడి కారణంగా చర్మం జిగటగా అనిపించకుండా, నూనె ఎక్కువగా పేరుకుపోకుండా ఉండేందుకు నిపుణులు సూచిస్తున్న చిట్కాలు ఇవే..
వేసవిలో జిడ్డు చర్మాన్ని సంరక్షించుకునేందుకు ముందుగా ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. ఆహార అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా సగం సమస్యను నివారించవచ్చని ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ హాస్పిటల్‌లోని డెర్మటాలజీ విభాగానికి చెందిన డాక్టర్ భావుక్ ధీర్ సూచిస్తున్నారు. వేసవి కాలంలో ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరమని ఆయన చెబుతున్నారు. బయటి ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉండాలి. వేయించిన, మసాలా వంటి అనారోగ్యకరమైన ఆహారాలు, జంక్ ఫుడ్ తినడం మానేయాలి. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తినడం బెటర్. అలాగే తాజా పండ్లు, కూరగాయలు తినాలి. బ్రేక్ ఫాస్ట్‌కు పండ్లు, డిన్నర్‌తో సలాడ్‌గా తాజా కూరగాయలను కూడా తీసుకోవచ్చు.
హైడ్రేటెడ్‌గా ఉండాలి
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి, సరైన మోతాదులో నీటిని తీసుకోవాలి. అలాగే పుచ్చకాయ, పైనాపిల్ వంటి పండ్లను తినాలి. వీటిలో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. ఇవి శరీరం, చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే, ఆ పండ్లలో ఉండే పోషకాలు మన మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
సన్‌స్క్రీన్ వినియోగించాలి
వేసవిలో మండే ఎండల కారణంగా వడదెబ్బతో పాటు అనేక చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వేసవిలో ఎండలోకి వెళ్లే ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయాలి. మీరు ఎక్కువసేపు ఎండలో ఉంటే, ప్రతి 2 గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్‌ను మళ్లీ అప్లై చేసుకుంటూ ఉండాలి. దీంతో సూర్యుడి హానికరమైన కిరణాల వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.
మాయిశ్చరైజర్
శీతాకాలం, వేసవి కాలం ఏదైనా చర్మంపై మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా ముఖ్యం. అయితే సమ్మర్ సీజన్‌లో లైట్ వెయిట్ మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో, ఆయిల్ పేరుకుపోకుండా చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీని కోసం జెల్ లేదా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. టోనర్‌ని కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మం pH స్థాయిని నిర్వహించడంలో సహాయపడుతుంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.