Lifestyle: పురుషుల్లో ఆ సమస్యకు కారణమవుతోన్న పెర్‌ఫ్యూమ్స్‌.. పరిశోధనల్లో సంచలన విషయాలు

|

Jul 31, 2024 | 11:39 AM

ముఖ్యంగా పెర్‌ఫ్యూమ్స్ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు లేదా, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి పలు పరిశోధనల్లో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెర్ఫ్యూమ్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పురుషుల్లో...

Lifestyle: పురుషుల్లో ఆ సమస్యకు కారణమవుతోన్న పెర్‌ఫ్యూమ్స్‌.. పరిశోధనల్లో సంచలన విషయాలు
Health
Follow us on

పెర్‌ఫ్యూమ్‌ ఉపయోగించడం అనేది సర్వసాధారణం.. మనలో చాలా మంది వీటిని కచ్చితంగా ఉపయోగిస్తుంటారు. శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకే, మంచి స్మెల్ రావాలనే ఉద్దేశమో కారణం ఏదైనా పెర్‌ఫ్యూమ్‌లను ఉపయోగించడం మాత్రం కామన్‌. అయితే దాదాపు చాలా వరకు పెర్‌ఫ్యూమ్స్‌ కెమికల్స్‌తోనే తయారు చేస్తారు. ఈ కారణంగానే వీటివల్ల పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలిసిందే.

ముఖ్యంగా పెర్‌ఫ్యూమ్స్ కారణంగా చర్మ సంబంధిత సమస్యలు లేదా, శ్వాస సంబంధిత సమస్యలు వస్తాయని చాలా మంది భావిస్తుంటారు. నిజానికి పలు పరిశోధనల్లో కూడా ఇవే విషయాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. పెర్ఫ్యూమ్స్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యకు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అధికంగా పెరఫ్యూమ్‌ను ఉపయోగించడం వల్ల స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా స్పెర్మ్‌కౌంట్‌పై ప్రభావం చూపడంలో ధూమపానం, మద్యపానం, ఊబకాయం వంటివి కారణాలవుతాయని మనందరికీ తెలిసిందే. అలాగే ఎక్కువ వేడి ఉండే ప్రదేశాల్లో పనిచేసే వారిలో కూడా స్పెర్మ్‌ కౌంట్ తగ్గుతుందని ఇప్పటి వరకు పలు పరిశోధనల్లో వెల్లడైంది. అయితే పెర్‌ఫ్యూమ్‌ సైతం స్పెర్మ్‌ కౌంట్ తగ్గడానికి కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.

వాటిర్‌ బాటిల్స్‌ తయారీలో ఉపయోగించే పాలికార్బోనేట్ రసాయనం ఉంటుంది. ఇది ఈస్ట్రోజెన్‌ స్థాయిలపై ప్రభావం చూపుతుంది. కొన్ని రకాల సబ్బులు, పెర్‌ఫ్యూమ్‌ బాటిల్స్‌లో కూడా పారాబెన్‌లను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇవి సింథటిక్‌ రసాయనాలు. ఇలాంటి పారాబెన్‌లను అధికంగా ఉపయోగించడం వల్ల స్పెర్మ్‌ కౌంట్ తగ్గడం మొదలవుతుంది. ఇది కాలక్రమేణా పురుషుల్లో వంధ్వత్వానికి దారి తీస్తుందని పరిశోధనలో తేలింది. పారాబెన్‌లను అధిక మోతాదులో ఉపయోగించే పురుషుల్లో టెస్టోస్టెరాన్ తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

మరిన్ని లైప్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..