
బాబా రామ్‌దేవ్ పతంజలి ద్వారా ప్రతి ఇంటికి తిరిగి ఆయుర్వేద పురాతన పద్ధతులను అనుసరించేలా చేస్తున్నారు. బాబా రామ్‌దేవ్ తన పతంజలి ఉత్పత్తులను అమ్మడమే కాదు శారీరక, మానసిక సమస్యలను నయం చేసే ఆయుర్వేద నివారణల గురించి కూడా చెబుతారు. ఆయన తన సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. బాబా రామ్‌దేవ్ ఆరోగ్యాని సంబంధించిన అనేక విషయాలు.. నివారణలు ఇస్తూ తన వీడియోలను పంచుకుంటూ ఉంటారు. ఈసారి బాబా రామ్‌దేవ్ వాత, పిత్త , కఫాలను నయం చేసే చికిత్స గురించి చెప్పారు.
నేటి బిజీ జీవితం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తున్నాయి. దీని కారణంగా శరీరంలోని మూడు ప్రధాన దోషాలైన వాత, పిత్త, కఫాల సమతుల్యతలో మార్పులు రావడం మొదలవుతాయి. వీటి సమతుల్యత చెదిరినప్పుడు, శరీరంలో వివిధ వ్యాధులు ప్రారంభమవుతాయి. కనుక వాత-పిత్త, కఫ దోషాలను సమతుల్యం చేయడానికి బాబా రామ్‌దేవ్ చెప్పిన ఖచ్చితమైన చికిత్స ఏమిటో తెలుసుకుందాం.
బాబా రామ్ దేవ్ చెప్పిన దివ్యౌషధ చికిత్స ఏమిటంటే
ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ అనే మూడు ప్రధాన దోషాలు ఉన్నాయి. బాబా రామ్‌దేవ్ ప్రకారం శరీరంలో దోషాల సమతుల్యతను కాపాడుకోవడం వ్యాధులను నివారించడానికి మాత్రమే కాదు దీర్ఘాయుస్సు, మానసిక ప్రశాంతతకు కూడా ముఖ్యం. దీని కోసం, బాబా రామ్‌దేవ్ కొన్ని సహజ పద్ధతులను సూచించారు. అవి ఏమిటంటే
ఈ పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో వీక్షించండి
మూత్రపిండాల సమస్యలు ఉన్న వ్యక్తులు
బాబా రాందేవ్ ప్రకారం ఎవరికైనా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే, సొరకాయ తినడం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. సొరకాయ మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. వాస్తవానికి సొరకాయలో విటమిన్ సి నుంచి విటమిన్ బి1 వరకు అనేక విటమిన్లు ఉన్నాయి. దీనితో పాటు, బార్లీ పిండితో చేసిన రోటీ కిడ్నీ రోగులకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బార్లీలో అధిక ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
చక్కెరను నియంత్రించడానికి.
చక్కెరను నియంత్రించడానికి అర్జున్ బెరడుతో పాటు దాల్చిన చెక్కను తినవచ్చని బాబా రామ్‌దేవ్ చెప్పారు. ఇలా చేయడం ద్వారా చక్కెర నియంత్రణలో ఉంటుంది. దీనితో పాటు, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అదే సమయంలో పచ్చి ఆహారం తినడం కూడా చక్కెర స్థాయిని, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.
సైనసిటిస్.. ఆస్తమా
బాబా రాందేవ్ సైనస్, ఆస్తమా కోసం పతంజలి ఉత్పత్తి గురించి కూడా చెప్పారు. ఎవరైనా సైనస్, ఆస్తమాతో బాధపడుతుంటే వారు అను నూనెను ఉపయోగించవచ్చని చెప్పారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)