AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiwi Fruits Benefits: రాత్రి నిద్రకు ముందు ఓ కివి పండు తిన్నారంటే.. ఆ సమస్యలన్నీ పరార్!

కివిలో ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ఈ పండుకు మార్కెట్లో యమ డిమాండ్ ఉంటుంది. ప్రతిరోజూ ఒక కివి తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలుసుకుందాం..

Kiwi Fruits Benefits: రాత్రి నిద్రకు ముందు ఓ కివి పండు తిన్నారంటే.. ఆ సమస్యలన్నీ పరార్!
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆ ప్రాంతాన్ని శుభ్రంగా కడగాలి. కివీ ఎంత ఆరోగ్యకరమైనదైనా, దానిని మితంగా తీసుకోవడం మాత్రమే ముఖ్యమని గుర్తుంచుకోవాలి. కివీ పండు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Surya Kala
|

Updated on: Aug 16, 2025 | 2:52 PM

Share

కివి పండు గురించి తెలియనివారుండరు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రుచికి కొద్దిగా పుల్లగా ఉన్నప్పటికీ చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడతారు. కొంతమందికి దీని రుచి అస్సలు సహించదు. నిజానికి కివిలో ఆరోగ్య ప్రయోజనాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే ఈ పండుకు మార్కెట్లో యమ డిమాండ్ ఉంటుంది. ప్రతిరోజూ ఒక కివి తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కనుక దీనిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం..

జీర్ణక్రియకు మేలు

ఫైబర్ అధికంగా ఉండే కివి పండు జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. కివిలో ఉండే ఆక్టినిడిన్ ఎంజైమ్ ప్రోటీన్లను జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అందువల్ల ఇది కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మంచిది

కివి పండ్లలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అంతే కాదు పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అదనంగా కివి పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

చర్మ ఆరోగ్యానికి మంచిది

కివి పండులో విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఈ పండు చర్మంలోని ముడతలను తగ్గించడంలో, చర్మం దృఢత్వాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. కివి తినడం వల్ల వృద్ధాప్య సంకేతాలు కూడా తగ్గుతాయి.

నిద్రలేమి నుంచి ఉపశమనం

కివిఫ్రూట్‌లో సెరోటోనిన్ ఉంటుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పడుకునే ముందు కివిఫ్రూట్ తినడం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట మంచి నిద్ర పొందడానికి రోజుకొక్క కివిఫ్రూట్ తినడం మంచిది.

కంటి ఆరోగ్యానికి మంచిది

కివి పండ్లలో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండ్లు కంటిశుక్లం, వయస్సు సంబంధిత కంటి సమస్యల నుంచి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..