మీ పార్ట్‌నర్‌తో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారా..? ఓసారి ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..!

బిజీ లైఫ్‌, రోజంతా ఒత్తిడితో భాగస్వామికి సమయం కేటాయించడం కష్టమవుతుంది. కానీ బంధాన్ని బలపరచడానికి గంటల సమయం అవసరం లేదు. సమాంతర ఆట పద్ధతి అనే సింపుల్ ట్రిక్‌తో మీరు మీకు నచ్చిన పనులు చేస్తూనే.. మీ భాగస్వామితో దగ్గరగా ఉన్న అనుభూతిని పొందవచ్చు.

మీ పార్ట్‌నర్‌తో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారా..? ఓసారి ఈ సింపుల్ ట్రిక్ ట్రై చేయండి..!
Happy Couple

Updated on: Aug 24, 2025 | 8:38 PM

రోజంతా పనులు, ఒత్తిడితో ఇంటికి చేరిన తర్వాత మీ భాగస్వామితో గడపడానికి సమయం దొరకడం లేదా..? అలాంటి పరిస్థితుల్లో కూడా ఒకరికొకరు దగ్గరగా ఉండటం చాలా ముఖ్యం. దీనికి పెద్ద పెద్ద ప్రణాళికలు అవసరం లేదు, చిన్న చిన్న పద్ధతులు కూడా బంధాన్ని బలపరుస్తాయి.

సమాంతర ఆట అంటే ఏంటి..?

మానసిక నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా..? పిల్లల ఎదుగుదలలో ఉండే సమాంతర ఆట (Parallel Play) అనే పద్ధతిని జంటలు కూడా ఉపయోగించవచ్చట. అంటే పిల్లలు ఒకే గదిలో వేర్వేరు ఆటలు ఆడుకుంటూ ఉంటారు కానీ ఒకరి ఆటలో మరొకరు కలవరు. ఈ పద్ధతినే సమాంతర ఆట అంటారు. 

మీరు, మీ భాగస్వామి ఒకే గదిలో వేర్వేరు పనులు చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు పుస్తకం చదువుతుంటే.. మీ భాగస్వామి ఫోన్‌ లో పాటలు వినవచ్చు. ఇలా వేర్వేరు పనులు చేస్తున్నా.. ఒకే చోట దగ్గరగా ఉండటం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది.

ఈ పద్ధతి ఎందుకు ఉపయోగపడుతుంది..?

ఒకరితో ఒకరు సమయం గడపడం మన ఆనందానికి చాలా అవసరం. ఈ సమాంతర ఆట పద్ధతి వల్ల జంటలకు నాకు నచ్చిన పని చేసుకుంటూనే, మన ఇద్దరి సమయాన్ని కలిసి గడిపిన భావన కలుగుతుంది. దీని వల్ల మీకు ఇష్టమైన పని చేస్తూనే మీ భాగస్వామి దగ్గరగా ఉన్నారనే ఆనందం కూడా దక్కుతుంది.

ఎలా ప్రారంభించాలి..?

ఈ పద్ధతిని పాటించడానికి ఎలాంటి పెద్ద ప్రణాళిక అవసరం లేదు. ఈ కింది చిన్న చిట్కాలను ప్రయత్నించండి.

  • కొంతసేపు మొబైల్, ల్యాప్‌ టాప్‌ లకు దూరంగా ఉండి ఒకరికొకరు గడపండి.
  • రాత్రి భోజనం లేదా కాఫీని కలిసి కూర్చుని తినే అలవాటు చేసుకోండి.
  • శారీరక అనుబంధం కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించండి.
  • చిన్న చిన్న కబుర్లు, నవ్వులు పంచుకోవడం ద్వారా ఆ క్షణాలను ఆనందంగా మార్చుకోండి.

ఈ సులభమైన సమాంతర ఆట పద్ధతితో మీరు బిజీ లైఫ్‌లో కూడా మీ భాగస్వామితో బంధాన్ని మరింత బలపరచుకోవచ్చు.