ఇంటి ఆకర్షణపైనే ఎక్కువ శ్రద్ద.. ఆ విషయంలో ఎక్కడ తగ్గని యాజమానులు..

| Edited By: Srikar T

Jun 15, 2024 | 12:09 PM

ఇల్లు ప్రతి ఒక్కరి కల.. తమకి నచ్చినట్లుగా ఇల్లును డిజైన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు.. అయితే ఇంటి డిజైన్ నుంచి మొదలుకుంటే కలర్స్ వాటి లైటింగ్ ప్రతి ఒక్కటి ప్రత్యేకత అని చెప్పాలి. ప్రస్తుతం ఇంటి కలర్స్‎తో పాటు గృహాలంకరణలో లైటింగ్ డిజైన్లు ప్రస్తుతం కీలకంగా మారాయి. ఇంటికి ఏ రంగులు బాగుంటాయి అని చాలామందిని అడగడం చూశాం. కానీ.. కొన్ని ఏళ్లుగా వీటి గురించి అవగాహన పెరగడంతో ఇంటికి నప్పే రంగులను గృహ యజమానులు వివేకంతో ఎంపిక చేసుకుంటున్నారు. నిపుణుల సలహా తీసుకుంటూ తగిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు.

ఇంటి ఆకర్షణపైనే ఎక్కువ శ్రద్ద.. ఆ విషయంలో ఎక్కడ తగ్గని యాజమానులు..
Special Lightings
Follow us on

ఇల్లు ప్రతి ఒక్కరి కల.. తమకి నచ్చినట్లుగా ఇల్లును డిజైన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు.. అయితే ఇంటి డిజైన్ నుంచి మొదలుకుంటే కలర్స్ వాటి లైటింగ్ ప్రతి ఒక్కటి ప్రత్యేకత అని చెప్పాలి. ప్రస్తుతం ఇంటి కలర్స్‎తో పాటు గృహాలంకరణలో లైటింగ్ డిజైన్లు ప్రస్తుతం కీలకంగా మారాయి. ఇంటికి ఏ రంగులు బాగుంటాయి అని చాలామందిని అడగడం చూశాం. కానీ.. కొన్ని ఏళ్లుగా వీటి గురించి అవగాహన పెరగడంతో ఇంటికి నప్పే రంగులను గృహ యజమానులు వివేకంతో ఎంపిక చేసుకుంటున్నారు. నిపుణుల సలహా తీసుకుంటూ తగిన డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు. ఇంటికి ఏ రంగు దీపాలు అయితే బాగుంటాయి.. ఏ గదిలో ఎటువంటి లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి.. ఇలా వివిధ రకాలుగా ఆలోచిస్తూ సొంతింటిని నిర్మించుకుంటున్నారు.

ఇల్లును నిర్మించిన తర్వాత ముఖ్యమైన వాటిలో దీపాలు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఎంతో ఇష్టపడి కట్టుకునే ఇంట్లో ‎ ప్రస్తుతం ఇంటీరియర్స్ ప్రధాన భూమిక పోషిస్తోంది. ఏ గదిలో ఎన్ని లైట్స్ ఉండాలి.. ఏసీ పిన్ సాకేట్ ఎక్కడ ఉండాలి.. స్విచ్ సాకెట్స్ ఎక్కడ అమర్చాలి. ఇలా అన్ని విషయాల్లో ఎలక్ట్రీషియన్స్‎తో చర్చించుకుంటున్నారు. ఇక లైట్స్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ కాలం మన్నిక ఇచ్చే ఎల్ఈడీ దీపాలు వాడమని చెప్పి వదిలేస్తుంటారు. దీంతో గదుల్లో తెలుపు రంగు దీపాలతో నింపేస్తున్నారు. లైట్స్ వేయగానే గదులన్నీ దగదగా వెలిసిపోతూ ఉంటాయి. కానీ ఇవే వెలుగులు కొన్ని సార్లు చికాకు పెడుతూ ఉంటాయి. అలాంటి సమయాల్లో లైట్స్ ఆర్పేసి చీకట్లో కూర్చుండి పోతారు. ఎందుకంటే మూడుకి తగ్గట్టుగా లైట్స్ ఎంపిక లేకపోవడంతో ఇంట్లోని వాతావరణం కూడా పూర్తిగా మారిపోతూ ఉంటుంది.

ఈ విధంగా డిఫరెంట్ లైట్స్ ఎంచుకుంటూ ఉన్నారు ఇంటి యజమానులు. ఈ లైట్స్‎లో యాంబియన్ లైటింగ్ అంటే గది అంతా సమానంగా స్ప్రెడ్ అయ్యేటువంటి లైటింగ్ ఇది. కిటికీ నుంచి వచ్చే సహజ వెలుతురు కావచ్చు.. లేదంటే లైట్స్ ఏర్పాటు చేసిన చోటు నుంచి వచ్చే వెలుగులు కావచ్చు. ప్రతి గది మధ్యలో కాంతిని పూర్తిగా ఆ రూమ్ అంతటా కనిపించేలాగా ఈ ఆంబియంట్ లైటింగ్ యూస్ చేస్తారు. ఇక డెకరేటివ్ లైటింగ్ ద్వారా పండుగల సమయంలో ఇంటిని అలంకరించేందుకు ఉపయోగించుకుంటారు. ఏ తరహా లైటింగ్ కావాలో నిర్ణయించుకున్న తర్వాత వాటికి తగ్గట్టుగా ఆంబియంట్ లైటింగ్, ఆక్సిడెంట్ లైటింగ్, డెకరేటివ్ లైటింగ్ అంటూ కొత్త రకాల లైటింగ్స్‎తో ఇంటికి కొత్త వెలుగులను తెచ్చుకుంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..