Kidney Health: ఆరోగ్యానికి మంచిదంటూ నీరు తెగ తాగేస్తున్నారా.. కిడ్నీలు షెడ్డుకు వెళ్ళే ప్రమాదం ఉంది సుమా.. తస్మాత్ జాగ్రత్త

శరీరం డీహైడ్రేట్ బారిన పడకుండా ఉండడం కోసం లేదా ఆరోగ్యం కోసం నీరు తాగడం తప్పని సరి అని భావిస్తున్నారు. దీంతో శరీరానికి అవసరం అయిన దాని కంటే ఎక్కువ మొత్తంలో నీరు తాగుతున్నారు. ఈ అలవాటు మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. ఒకొక్కసారి మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ రోజు నీరు ఎక్కువ తాగడం వలన కలిగే అనారోగ్యం ఏమిటి? దానిని ఎలా నివారించాలో ఈరోజు తెలుసుకుందాం.. .

Kidney Health: ఆరోగ్యానికి మంచిదంటూ నీరు తెగ తాగేస్తున్నారా.. కిడ్నీలు షెడ్డుకు వెళ్ళే ప్రమాదం ఉంది సుమా.. తస్మాత్ జాగ్రత్త
Kidney Health

Updated on: Jun 28, 2025 | 8:55 PM

మన శరీరంలోని అన్ని విధులను నిర్వహించడానికి నీరు చాలా ముఖ్యమైనది. ఇది శరీరం నుంచి విషపూరిత వ్యర్ధాలను తొలగించడంలో, సరైన జీర్ణక్రియను నిర్వహించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శక్తి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఒక సాధారణ వయోజన వ్యక్తి రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీరు త్రాగాలని సలహా ఇస్తారు. అయితే ఎక్కువ మంది ఆరోగ్యంగా కనిపించడానికి లేదా నిర్జలీకరణాన్ని నివారించడానికి నీరు త్రాగడం ఆరోగ్యకరం అని భావించి అధిక మొత్తంలో నీరుని తాగుతున్నారు. అయితే ఈ అలవాటు శరీరానికి హానికరం. ఎక్కువ నీరు త్రాగడం వలన మూత్రపిండాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఎక్కువ నీరు త్రాగడం వల్ల మూత్రపిండాలు ఎలా దెబ్బతింటాయి? లక్షణాలు ఏమిటి ? నివారించడానికి మార్గాలు ఏమిటి అని తెలుసుకుందాం.

మనం అవసరానికి మించి నీరు త్రాగినప్పుడు శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడానికి మన మూత్రపిండాలు కష్టపడి పనిచేయవలసి ఉంటుంది. ఇలాంటి సమయంలో మూత్రపిండాలపై ఒత్తిడి పెరుగుతుంది. వాటి పనితీరు క్రమంగా తగ్గుతుంది. ఎక్కువ నీరు త్రాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయి తగ్గుతుంది. ఇది హైపోనాట్రేమియా అనే పరిస్థితికి దారితీస్తుంది. ఈ స్థితిలో కణాలు వాపు ప్రారంభమవుతాయి. ఒకొక్కసారి మెదడు, మూత్రపిండాల కణాలను దెబ్బతీస్తుంది. ఇది నిరంతరం జరిగితే మూత్రపిండాల వడపోత సామర్థ్యం ప్రభావితమవుతుంది. క్రమంగా మూత్రపిండాలు విఫలమవుతాయి.

లక్షణాలు ఏమిటి?
సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లోని నెఫ్రాలజీ విభాగానికి చెందిన డాక్టర్ హిమాన్షు వర్మ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఎక్కువ నీరు త్రాగడం వల్ల శరీరంలో ఏర్పడే అసమతుల్యతకు సంబంధించిన కొన్ని లక్షణాలు క్రమంగా కనిపించడం ప్రారంభమవుతాయి. అన్నింటిలో మొదటిది వ్యక్తికి తరచుగా మూత్ర విసర్జన సమస్య ఉంటుంది. ఇది రాత్రి నిద్రకు భంగం కలిగిస్తుంది. దీనితో పాటు చేతులు, కాళ్ళలో వాపు, అలసట, తలతిరగడం, వికారం, తలనొప్పి , మానసిక ఆందోళన వంటి సమస్యలు సంభవించవచ్చు. ఎక్కువ నీరు త్రాగడం వల్ల రక్తంలో సోడియం స్థాయి అధికంగా పడిపోయినప్పుడు.. ఒకొక్కసారి ఆ వ్యక్తి అపస్మారక స్థితిలోకి కూడా వెళ్ళవచ్చు. దీనితో పాటు మూత్రం రంగు ఎప్పుడూ లేత రంగులో ఉంటే శరీరంలో నీటి పరిమాణం అవసరానికి మించి ఎక్కువగా ఉందని ఇది సంకేతం కావచ్చు. అటువంటి పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే, మూత్రపిండాల పనితీరు బలహీనపడటం ప్రారంభమవుతుంది. దీని కారణంగా శరీరంలోని విషపూరిత వ్యర్ధాలు పూర్తిగా బయటకు రాలేవు. అనేక తీవ్రమైన వ్యాధులు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలంటే

  1. మీ దాహాన్ని బట్టి నీరు త్రాగాలి.
  2. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగితే సరిపోతుంది.
  3. ఎక్కువగా చెమటలు పడుతుంటే లేదా వ్యాయామం చేస్తున్నా కొబ్బరి నీళ్లు లేదా ORS వంటి ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే వాటిని త్రాగండి. కేవలం నీళ్ళు మాత్రమే కాదు.
  4. ఎవరైనా నిరంతర అలసట, తరచుగా మూత్రవిసర్జన సమస్యను ఎదుర్కొంటుంటే.. తక్షణమే వైద్యుడిని సంప్రదించండి.
  5. పిల్లలకు, వృద్ధులకు వారి అవసరాలకు అనుగుణంగా నీరు ఇవ్వండి. వారిని అధిక నీటి నుంచి రక్షించండి.

 

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)