
ఆప్టికల్ ఇల్యూషన్ అనేది మీ మెదడుకి పదును పెట్టే ఒక సవాల్. ఇల్యూషన్ అనేది గ్రీకు పదం. దీని అర్థం గందరగోళాన్ని వ్యాప్తి చేయడం. ఈ బ్రెయిన్ టీజర్ లో కూడా అదే జరుగుతుంది. ఈ గేమ్ లో అలాంటి కొన్ని చిత్రాలు మీ ముందు ఉంచబడతాయి. అవి మీకు ఒక దృశ్యాన్ని చూపుతాయి.. అయితే అందులో అసలు దాగు ఉండే నిజం వేరే ఉంటుంది. ఈ చిత్రాల్లోని సవాల్ ను పరిష్కారం చేయడానికి ప్రయత్నించడం వలన మెదడుకు వ్యాయామం లభిస్తుంది. దృష్టిని, సృజనాత్మకతను పెంచుతుంది. తార్కిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. పరిశీలన నైపుణ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే దీనిని పరిష్కరించడానికి కూడా సాధన చేయాలి. నేటి ఆప్టికల్ ఇల్యూషన్ సవాలు ఏమిటో చూద్దాం.
సవాలు ఏమిటి?
ముందు ఒక చిత్రం ఉంది. ఇందులో మీరు కొన్ని పందులు ఒక కుండలో కుక్కను కూర్చోబెట్టడాన్ని చూడవచ్చు. ఈ కార్టూన్ దృశ్యాన్ని చూసినప్పుడు ఇది ఫన్నీగా అనిపిస్తుంది. ఈ చిత్రంలో పందుల ఇల్లు, వాటి వస్తువులు మొదలైన అనేక రకాల ఇతర వస్తువులు ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే ఇన్ని రకాల చిత్రాల్లో ఎక్కడో ఒక చోట బేస్ బాల్ బ్యాట్ దాగి ఉంది. ఈ బేస్ బాల్ బ్యాట్‌ను 6 సెకన్లలోపు కనుగొనడం నేటి సవాలు. మీరు దానిని కనుగొనగలరో లేదో చూద్దాం.
మీకు ఏ సమాధానం వచ్చింది?
మీరు ఆ బ్యాట్‌ను 6 సెకన్లలోపు కనుగొంటే.. మీ పరిశీలన శక్తి అమోఘం అని అర్ధం. అయితే ఎంత పరిశీలన చేసినా పందుల మధ్య దాగుతున్న బ్యాట్‌ను కనుగొనలేకపోతే.. మేము మీకు సహాయం చేస్తాము. మీరు చిత్రం కుడి వైపున వేలాడుతున్న ఫోటో ఫ్రేమ్‌ను జాగ్రత్తగా చూస్తే.. దాని పక్కన ఒక బేస్ బాల్ బ్యాట్ వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. మేము దానిని మీ కోసం కూడా పసుపు రంగు రింగ్ తో గుర్తించాము.
Optical Illusion 1
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..