Olive Oil Benefits: స్నానం చేసే నీళ్లలో కొన్ని చుక్కలు ఆలివ్‌ నూనె కలిపారంటే..

|

Oct 24, 2022 | 5:31 PM

ఆలివ్‌ నూనెలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో భాగం దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ శాతం క్రమంగా తగ్గుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. దీనిలోని పాలీఫినాల్..

Olive Oil Benefits: స్నానం చేసే నీళ్లలో కొన్ని చుక్కలు ఆలివ్‌ నూనె కలిపారంటే..
Olive Oil Benefits
Follow us on

ఆలివ్‌ నూనెలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆహారంలో భాగం దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ శాతం క్రమంగా తగ్గుతుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. దీనిలోని పాలీఫినాల్ అనే ఔషధం రక్తనాళాలు, గుండె కవాటాల్లో చేరుకునే చెడు కొలెస్ట్రాల్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తుంది. తత్ఫలితంగా గుండె సమస్యలు, బరువు పెరగడం వంటి అనారోగ్యాలు దరిచేరకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తి వృద్ధి చేయండంలో, గర్భాశయ, పేగు క్యాన్సర్ల నివారణలో, చర్మ సమస్యలను దూరం చేయడంలో ఆలివ్‌ నూనె ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మానికి చాలా మేలు లక్షణాలు ఆలివ్‌ నూనెలో మెండుగా ఉంటాయి. ప్రతి రోజూ స్నానం చేసే నీళ్లలో ఆలివ్ నూనెను కొన్ని చుక్కలు వేశారంటే చర్మాన్ని ఎల్లప్పుడు తేమ ఉంచుతుంది. ఆలివ్ నూనెలోని పోషకాలు యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని మృదువుగా కూడా ఉంటుంది. దీనిలోని ‘ఈ’, ‘కె’ విటమిన్లు చర్మాన్ని ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంచుతుంది.

స్నానం నీళ్లలో ఆలివ్‌ నూనెను ఎలా ఉపయోగించాలంటే..
బకెట్‌ చల్లని లేదా గోరు వెచ్చని నీళ్లలో 4 చెంచాల నూనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కాసేపు కదిలించకుండా, అనంతరం స్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.