Obesity Problems: ఈ ఐదు అలవాట్లు వదిలేస్తే నాజూకైన శరీరం మీ సొంతం.. అందంతోపాటు ఆరోగ్యం కూడా బోనస్..

బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) స్కేల్‌ 25  పాయింట్ల కంటే ఎక్కువ వస్తే ఊబకాయం అంటారు. ఊబకాయ సమస్యల వల్ల జీవక్రియ రుగ్మతలు, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌ వంటివి అధికంగా వస్తాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Obesity Problems: ఈ ఐదు అలవాట్లు వదిలేస్తే నాజూకైన శరీరం మీ సొంతం.. అందంతోపాటు ఆరోగ్యం కూడా బోనస్..
Obesity

Updated on: Mar 05, 2023 | 2:45 PM

ప్రస్తుతం ఊబకాయం సమస్య అందరినీ వేధిస్తూ ఉంది. ఆహార అలవాట్లల్లో గణనీయమైన మార్పుల వల్ల ప్రతి ఒక్కరికీ ఊబకాయం వస్తుంది. లింగభేదంతో సంబంధం లేకుండా ఈ సమస్యతో అందరూ బాధపడుతున్నారు. నిశ్చల జీవనశైలితో పాటు సాధారణ కార్బోహైడ్రేట్‌లు, ట్రాన్స్, సంతృప్త కొవ్వులపై ప్రస్తుత కాలంలో ఎక్కువుగా ఆధారపడుతున్నారు. దీంతో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) స్కేల్‌ 25  పాయింట్ల కంటే ఎక్కువ వస్తే ఊబకాయం అంటారు. ఊబకాయ సమస్యల వల్ల జీవక్రియ రుగ్మతలు, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌ వంటివి అధికంగా వస్తాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే అధిక ఊబకాయం సమస్యకు కేవలం ఆహార అలవాట్లే కాదు అనారోగ్యకర అలవాట్లు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం సమస్య నుంచి బయటపడడానికి కొన్నిఅలవాట్లను మానుకుంటే చాలా మంచిదని సూచిస్తున్నారు. వారు సూచించే ఆ అనారోగ్యకర అలవాట్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

అధిక మాంసాహారం తినడం

మాంసంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. అలాగే లీన్ కండర ద్రవ్యరాశికి మద్దతు ఇస్తుంది. ఇది కాలక్రమేణా కొవ్వు ద్రవ్యరాశిని తగ్గించడంలో సహాయపడుతుంది. రోజంతా తీసుకునే క్యాలరీలపై ప్రభావం చూపుతుంది. నిపుణులు సూచన ప్రకారం మన బరువు సమానమైన గ్రాముల ప్రోటీన్లు ఓ రోజులో తీసుకుంటే సరిపోతుంది. అయితే అధికంగా మాంసాహారం తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే వాటి కంటే అధిక ప్రోటీన్లు అందుతాయి.

చక్కెర పానీయాలను దూరం పెట్టడం

 చక్కెర పానీయాలు జీవక్రియ రుగ్మతలను పెంచడంతో పాటు బరువు పెరగడంలో బలమైన సంబంధం ఉంటుంది. పండ్ల రసాలు లేదా సోడాలు లేదా మిక్సర్లు లేదా ఎనర్జీ డ్రింక్స్ అయినా, చక్కెర పానీయాలు ఓవర్ టైం వల్ల ఊబకాయానికి దారి తీస్తుంది. అందువల్ల పోషకాహార నిపుణులు చక్కెర పానియాలను వదిలేయాలని సూచిస్తూ ఉంటారు. 

ఇవి కూడా చదవండి

వ్యాయామం లేకపోవడం

డైట్ మేనేజ్‌మెంట్‌తో పాటు బరువు తగ్గడానికి వ్యాయామం కీలకం. స్థూలకాయాన్ని అధిగమించడానికి, నిపుణులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సిఫార్సు చేస్తున్నారు. అది కార్డియో వ్యాయామాలు, బరువు శిక్షణ, యోగా, పైలేట్స్ లేదా మరేదైనా వర్కౌట్ రూపం కావచ్చు, ఫిట్‌నెస్ స్థూలకాయాన్ని అధిగమించడంలో కీలకంగా పని చేస్తుంది. 

ధూమపానం మానేయడం

స్థూలకాయం, బరువు పెరగడానికి ధూమపానం కూడా కారణమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ధూమపానం వల్ల క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతగా ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

8 గంటల నిద్ర

మెటబాలిక్ డిజార్డర్స్, ఆకలి బాధలు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటివి దీర్ఘకాలంలో బరువు పెరగడానికి ప్రధాన కారకాలుగా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం తప్పనిసరి. ప్రతిరోజూ తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఊబకాయ సమస్యల నుంచి బయటపడవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..