Touring Spots: హైదరాబాద్‌ దగ్గర్లోనే అదిరే టూరింగ్‌ స్పాట్‌.. ట్రిప్‌నకు వెళ్లడానికి దీనికి మించింది లేదుగా..!

తెలంగాణలోనే మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా? అవును మీరు వింటున్నది నిజమే తెలంగాణలోని నాగర్ కర్నూల్‌లోని సోమశిల, గ్రామాన్ని మినీ మాల్దీవులుగా పేర్కొంటారు. ఈ గ్రామంలో హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిమీ దూరంలో ఉంది. కాబట్టి ఈ టూరిస్ట్‌ ప్రదేశం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Touring Spots: హైదరాబాద్‌ దగ్గర్లోనే అదిరే టూరింగ్‌ స్పాట్‌.. ట్రిప్‌నకు వెళ్లడానికి దీనికి మించింది లేదుగా..!
Somasila

Edited By:

Updated on: Nov 01, 2023 | 10:09 PM

మరో 15 రోజుల్లో కార్తీకమాసం స్టార్ట్‌ అవుతుంది. కార్తీక మాసంలో చాలా మంది వనసమారాధనలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే మారుతున్న కాలం బట్టి చాలా మంది కార్తీకమాసంలో ట్రిప్‌లు ప్లాన్‌ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ వెళ్లేలా ఆధ్యాత్మిక టూరింగ్‌ స్పాట్లు కోరుకుంటూ ఉంటారు. అలాగే సరదాగా నీటిలో ఆడే ప్రదేశాల గురించి వెతుకుతూ ఉంటారు. అయితే తెలంగాణలోనే మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా? అవును మీరు వింటున్నది నిజమే తెలంగాణలోని నాగర్ కర్నూల్‌లోని సోమశిల, గ్రామాన్ని మినీ మాల్దీవులుగా పేర్కొంటారు. ఈ గ్రామంలో హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిమీ దూరంలో ఉంది. కాబట్టి ఈ టూరిస్ట్‌ ప్రదేశం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

సోమశిల కృష్ణా నది ఒడ్డున ఉంది. చూడడానికి ఈ గ్రామం ద్వీపంలా ఉంటుంది. ఇక్కడ దాదాపు 15 దేవాలయాలు ఉంటాయి. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీ లలితా సోమేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న 15 ఆలయాల్లో కూడా శివుడినే పూజిస్తారు. ఈ ఆలయం 7వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్నారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి సందర్బాల్లో ఇక్కడకు టూర్‌ వేయడం మంచివది. అలాగే ఇక్కడ 12 ఏళ్లు తర్వాత ఓ సారి వచ్చే కృష్ణా పుష్కరాలు సమయంలో ఇక్కడ పుణ్యస్నానం కోసం వేలాది మంది వస్తారు. అయితే ఈ దేవాలయాన్ని ప్రస్తుతం వరదల నుంచి రక్షించడానికి ఎత్తయిన​ ప్రదేశంలోకి మార్చారు. 

మతపరమైన ప్రాముఖ్యతను పక్కన పెడితే ఈ ప్రదేశం చాలా ఇష్టపడే పిక్నిక్, డే ఔటింగ్ స్పాట్‌గా ఉంటుంది. యాత్రికులు విశ్వాసం, వినోదాన్ని మిళితం చేసేలా ఇక్కడ పరిసరాలు ఉంటాయి. ముఖ్యంగా కృష్ణా నది బ్యాక్ వాటర్స్ ప్రకృతి రమణీయత మిమ్మల్ని కట్టి పడేస్తుంది.  ఈ ప్రదేశం హైదరాబాద్‌కు దగ్గరగా ఉండడం వల్ల కేవలం ఒక్కరోజులో వెళ్లి వచ్చేయవచ్చు. సోమశిల గ్రామానికి కర్నాటక, మహారాష్ట్ర నుంచి కూడా పర్యాటకులు వస్తారు. 

ఇవి కూడా చదవండి

తెలంగాణ పర్యాటక శాఖ సందర్శకులకు వసతి కల్పించడానికి అనేక వాటర్ ఫ్రంట్ కాటేజీలను నిర్వహిస్తోంది. ఈ రివర్ ఫ్రంట్ రిసార్ట్‌లు కృష్ణా నది సుందరమైన దృశ్యాలను మనం వీక్షించవచ్చు. బోటింగ్, యాంగ్లింగ్ చేసే అవకాశం ఉంది. అలాగే భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం చేరుకోవడానికి సందర్శకులు బ్యాక్ వాటర్‌లో పడవ ప్రయాణం కూడా చేయవచ్చు. దేవాలయాలు, రివర్ ఫ్రంట్ రిసార్ట్‌లతో పాటు, సందర్శకులు సోమశిల వ్యూ పాయింట్‌ని ఎంజాయ్‌ చేయవచ్చు. అందువల్ల ఫ్యామిలీతో హ్యాపీగా ట్రిప్‌నకు వెళ్లడానికి ఈ గ్రామం చాలా సౌకర్యంగా ఉంటుంది. 

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి