కుంకుడు చెట్టు తెలుసుకదా.. దాని కాయలు మనం తలంటుకోడానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు వీటి వాడకం తగ్గి షాంపూల వినియోగం ఎక్కువైపోయిందనుకోండి. అలాగే జుట్టుకూడా ఎక్కువే పోయింది. ఇప్పుడీ జుట్టు సంగతి ఎందుకు గుర్తుచేస్తున్నారు అనుకుంటున్నారా.. మన ఇప్పుడు ఓ కొత్త రకం షాంపూ గురించి తెలుసుకోబోతున్నాం. అది న్యాచురల్ షాంపూ. అది ఒక చెట్టు నుంచి వస్తుంది. డైరెక్ట్ మొక్కనుంచి అలా పిండుకొని వచ్చి నేరుగా వాడుకోవచ్చు.
ఈ మొక్కపేరు షాంపూ జింజర్ లిల్లీ. ఈ మొక్కకి పైనాపిల్ కాయలను పోలిన పువ్వులు వస్తాయి. వాటినిండా ఒక రకమైన ద్రవం ఉంటుంది. అదే షాంపూ. ఇలా పిండగానే చక్కగా జ్యూస్ మాదిరిగా బయటకు వస్తుంది. దాన్ని ఓ మగ్గులో పట్టుకొని వచ్చి స్నానం చేసేయొచ్చు. అడవుల్లో జీవించేవారికి ఇదే షాంపూ. కల్తీ లేని స్వచ్ఛమైన షాంపూ. వారు దీనినే షాంపూలా, ఒంటికి రుద్దుకునే సోపులా ఉపయోగించుకుంటారు. ఈ షాంపూ రసం సువాసనలు వెదజల్లుతుంది. స్నానం చేశాక.. సెంటులో మునిగితేలినట్లు అనిపిస్తుంది. పరిమళాలు వెదజల్లుతాయి. దీనికి సైంటిఫిక్ నేమ్ కూడా ఉంది. అదే జింజిబెర్ జెరుంబెట్ అంటారు. ఈ మొక్కల రసాన్ని కొన్ని రకాల వంటల్లో ఫ్లేవర్ కోసం వాడుతారట. అలాగే మందుల తయారీలోనూ ఉపయోగిస్తారట. వీటి జన్మస్థలం ఆసియానే అయినా, హవాయ్, మలేసియా సహా చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి. ఎండ ఉండే దేశాల్లో ఇవి బాగా పెరుగుతాయి.
Natural shampoo
Zingiber zerumbet is a plant from the ginger family. Found in many tropical countries. After squeezing the plant to use to cleanse your hair. The plant replenishes. Too much washing with chemical shampoos, strips hair of natural oils A shampoo as nature intended. pic.twitter.com/kGEO2qHcFA— WhatdoIknow (@Earstohearyou) October 25, 2022
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి