Lifestyle: పొట్టతో ఇబ్బందిగా ఫీలవుతున్నారా.? ఈ డ్రింక్స్‌తో ఇట్టే కరిగిపోద్ది..

|

Apr 06, 2024 | 4:23 PM

శారీరశ్రమ పూర్తిగా తగ్గిపోవడం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల పొట్ట సమస్యతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పాతికేళ్లు కూడా నిండని వారి ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి...

Lifestyle: పొట్టతో ఇబ్బందిగా ఫీలవుతున్నారా.? ఈ డ్రింక్స్‌తో ఇట్టే కరిగిపోద్ది..
Belly Fat
Follow us on

శారీరశ్రమ పూర్తిగా తగ్గిపోవడం, తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల పొట్ట సమస్యతో బాధపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. పాతికేళ్లు కూడా నిండని వారి ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడానికి చాలా మంది జిమ్ముల బాటపడుతుంటారు, డైటింగ్ పేరుతో కడుపు మాడ్చుకుంటుంటారు. అలా కాకుండా ఉదయం నిద్రలేవగానే కొన్ని రకాల డ్రింక్స్‌ను తీసుకుంటే కొద్ది రోజుల్లోనే కడుపు చుట్టూ కొవ్వు ఇట్టే తగ్గిపోతుంది. ఇంతకీ ఆ నేచురల్ డ్రింక్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* గ్రీన్‌ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిసిందే. బరవు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఉదయం పూట టీ, కాఫీలకు బదులుగా గ్రీన్‌ టీని అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో గ్రీన్‌ టీ సమర్థవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ ఉదయం ఒక కప్పు సాయంత్రం ఒక కప్పు గ్రీన్‌ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

* పొట్ట తగ్గాలనుకునే వారికి నిమ్మకాయ రసం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. పడగడుపు నిమ్మరసం తాగితే శరీరంలోని కొవ్వు కరిగిపోతుందని నిపుణులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా నిమ్మకాయంలో తేనె లేదా బ్లాక్‌ సాల్ట్ను కలుపుకొని తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇలా క్రమంతప్పకుండా ప్రతీరోజూ ఉదయం నిమ్మరసం తీసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు కరగడాన్ని ఇట్టే గమనించవచ్చు.

* పొట్ట చుట్టూ కొవ్వును కరిగించడంలో వాము కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతీ వంటింట్లో కచ్చితంగా ఉండే వస్తువుల్లో వాము ప్రధానమైంది. వాము ముందు రోజు రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే కొన్ని రోజుల్లోనే పొట్ట తగ్గడాన్ని చూడొచ్చు. ప్రతీ రోజూ ఇలా తీసుకోవాలని చెబుతున్నారు.

* అన్న తినగానే తీసుకునే సోంపు తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుందని తెలిసిందే. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టే సోంపు బరువు తగ్గడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా సోంపును తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీటిని వడకట్టుకొని తీసుకుంటే పొట్ట చుట్టూ కొవ్వు తగ్గిపోతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..