పుట్టిన 9 నెలల తర్వాత శిశువులకు దంతాలు(Teething in Babies) రావడం సర్వసాధారణం. ఈ సమయంలో పిల్లలు అనేక సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తారు. ఈ సమస్యలలో వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో బాధపడుతున్న పిల్లలు చాలా నీరసంగా, డిప్రెషన్‌కు గురవుతారు. మన పిల్లలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురవుతారు. తమ చిన్నారికి విరేచనాలు ఎందుకు అవుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. తల్లిదండ్రులు ఇలా అందోళనకు గురికావడం వల్ల చిన్నారులు మరింత నీరసంగా మారిపోతారు. ముందుగా మీరు మీ పిల్లల బద్ధకం, విచారాన్ని తొలగించాలనుకుంటే దీని కోసం కొన్ని ఇంటి చిట్కాలను అనుసరించండి.
దంతాలు వచ్చిన మొదటి కొద్ది రోజులు పిల్లల శరీరం నుంచి చాలా నీరు(లాలాజలం, సొల్లు) బయటకు వస్తుంది. ఈ పరిస్థితిలో పిల్లలను హైడ్రేట్‌గా ఉంచడానికి కొంత ఎక్కువగా నీరు ఇవ్వండి. దీని ద్వారా బిడ్డ నీరసంగా ఉండదు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
ఇవి కూడా చదవండి: Elon Musk Buy Twitter: ఎలన్ మస్క్ చేతిలోకి ట్విట్టర్ పిట్ట.. 44 బిలియన్ డాలర్లకు డీల్..