Mutton: మటన్‌లోని ఈ పార్ట్ వెరి వెరి స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..

మేక తలకాయ కూరలో ప్రోటీన్, విటమిన్ బి 12, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా కొంత మొత్తంలో ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. అంతేకాకుండా మటన్ హెడ్ కర్రీలోని విటమిన్ బి 12 రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది. ఇంకా కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది.

Mutton: మటన్‌లోని ఈ పార్ట్ వెరి వెరి స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు..
Talakaya Curry

Updated on: Jan 12, 2026 | 11:42 AM

నాన్ వెజ్ ప్రియులు మటన్ ను ఎంతో ఇష్టంగా తింటారు. మటన్‌లో ప్రోటీన్‌తోపాటు ఎన్నో పోషకాలు దాగున్నాయి. ఇది ఇది కండరాలు, ఎముకల బలాన్ని పెంచడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, మెదడు పనితీరును మెరుగుపరచడం వరకు ఎన్నో విధాలుగా శరీర అభివృద్ధికి దోహదపడుతుంది. అయితే.. మటన్ లోని ప్రతి పార్ట్ ఆరోగ్యానికి మంచిదే.. మేక తలకాయ.. లివర్, కాళ్లు.. ఇలా అన్ని పోషకాలతో నిండి ఉంటాయి.. అయితే.. మేక తలకాయ కూర పోషకాలతో నిండిన అద్భుతమైన ఆహారం అని డైటీషియన్లు చెబుతున్నారు. ఇందులో ప్రోటీన్, విటమిన్ బి12, ఐరన్, ఫాస్పరస్, అలాగే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, శక్తిని అందించడం ఇలా మొత్తం ఆరోగ్యానికి సహాయపడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది.. గుండె ఆరోగ్యానికి సహాయపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు..

మేక తలకాయ కూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

తలకాయ కూరలోని విటమిన్ బి12 రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ఇనుము లోపం వల్ల కలిగే రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.

గ్లూకోసమైన్, కాండ్రాయిటిన్ కీళ్ల నొప్పులను తగ్గించి, ఎముకల ఆరోగ్యానికి తోడ్పడతాయి. కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను పటిష్టం చేస్తాయి.

ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని ఆరోగ్యంగా, స్థితిస్థాపకంగా ఉంచుతుంది.

మేక తలకాయలోని విటమిన్ ఎ కళ్ల ఆరోగ్యాన్ని, ముఖ్యంగా రాత్రిపూట దృష్టిని మెరుగుపరుస్తుంది. ఈ విధంగా, మేక తలకాయ కూర మొత్తం ఆరోగ్యానికి దోహదపడుతుంది.

మేక తలకాయ కూరలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇది క్యాన్సర్‌కు కారణమవుతుంది. తలకాయ కూర క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతుందని పేర్కొంటున్నారు.

మేక తలకాయ కూర ఆరోగ్యకరమైన చర్మం, జుట్టుకు తోడ్పడటం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తుంది..

తలకాయ కూరను ఇలా చేసుకోండి..

మటన్ తలకాయ కూరను మటన్ లానే వండుకోవచ్చు.. అయితే.. వండే విధానం వేరేగా ఉంటుంది. కూర వండాలంటే ముందుగా తలకాయను శుభ్రంగా కడిగి.. ఉప్పు, పసుపుతో కొద్దిసేపు నానబెట్టాలి.. తర్వాత నూనెలో ఉల్లి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేసి వేయించి.. తలకాయ ముక్కలు వేసి బాగా కలిపి.. సరిపడా కారం వేసి.. నీళ్లు పోసి కుక్కర్‌లో ఉడికించాలి.. చివరిగా కొబ్బరి, గరం మసాలా, కొత్తిమీర వేసి దించేస్తే రుచికరమైన తలకాయ కూర రెడీ అవుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..