Mouthwash: ప్రతిరోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? అయితే, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

|

Feb 06, 2024 | 7:33 AM

మౌత్‌వాష్‌లోని రసాయనాల కారణంగా నోటి ఆరోగ్యంపై సైడ్‌ ఎఫెక్ట్స్‌ తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. నోరు ఎండిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ఎందుకంటే మౌత్ వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది. మౌత్ వాష్ దురద, చికాకు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. మౌత్ వాష్ వల్ల కొందరిలో దంత క్షయం సమస్యలు కూడా సాధారణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దంత సమస్యలు, నోటి సమస్యలు..

Mouthwash: ప్రతిరోజూ మౌత్ వాష్ వాడుతున్నారా..? అయితే, ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!
Mouthwash
Follow us on

నోటి సంరక్షణ కోసం టూత్ బ్రష్‌తో పాటు ప్రతిరోజూ ఉదయం మౌత్‌వాష్‌ని ఉపయోగిస్తాము. మౌత్ వాష్ నోటి దుర్వాసనను తొలగిస్తుంది. కానీ, దీన్ని రోజూ వాడితే ఆరోగ్యానికి హాని కలుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మౌత్‌వాష్‌లోని రసాయనాల కారణంగా నోటి ఆరోగ్యంపై సైడ్‌ ఎఫెక్ట్స్‌ తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. నోరు ఎండిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ఎందుకంటే మౌత్ వాష్‌లో ఆల్కహాల్ ఉంటుంది. మౌత్ వాష్ దురద, చికాకు వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. మౌత్ వాష్ వల్ల కొందరిలో దంత క్షయం సమస్యలు కూడా సాధారణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, దంత సమస్యలు, నోటి సమస్యలు ఉన్నవారు మౌత్ వాష్ ఉపయోగించకూడదు. అంతేకాదు మౌత్ వాష్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయని చెబుతారు. దంతక్షయం, చిగుళ్ల నొప్పి వల్ల దంతాలు రంగు మారుతాయని చెప్పారు. ముఖ్యంగా మౌత్ వాష్ లో ఉండే కెమికల్స్ వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయని అంటున్నారు. కాబట్టి మౌత్ వాష్ వాడకానికి సంబంధించి నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.

కొందరు వ్యక్తులు దంత సమస్యలను కలిగించే మౌత్ వాష్‌లను క్రమం తప్పకుండా ఉపయోగిస్తుంటారు. ఇది దంతాల మీద మరకలను కలిగిస్తుంది. దంతాలు కూడా గరుకుగానూ, బలహీనంగానూ ఉంటాయి. కాబట్టి మార్కెట్ లో లభించే రసాయనాలు కలిపిన మౌత్ వాష్ కు బదులు సహజసిద్ధమైన మౌత్ వాష్ ను తయారు చేసి వాడుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

అలాగే, దంత సంరక్షణ కోసం క్రమం తప్పకుండా బ్రషింగ్, ఇంటర్ డెంటల్ క్లీనింగ్, డెంటల్ చెకప్‌లు చేయడం వల్ల దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. చిగుళ్ల వ్యాధులు, దంత సమస్యలు కొందరిలో జాగ్రత్తలు తీసుకోవాలి. దంత సమస్యల విషయంలో మంచి నోటి పరిశుభ్రతను పాటించడం, వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది. రోజూ తిన్న తర్వాత నీళ్లతో నోరు కడుక్కోవడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..