Bed Coffee Tips: ఉదయాన్నే బెడ్ కాఫీ తాగే అలవాటు మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

| Edited By: Anil kumar poka

Jan 20, 2023 | 8:44 PM

కాఫీలో కెఫీన్ అనే పదార్థం జీర్ణక్రియకు కీడు చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మనిషి ఆరోగ్య స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుందని తేలింది. ఇది తరచుగా జన్యు వైవిధ్యాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఉదయాన్నే కాఫీ తాగే కొంతమందికి బూస్ట్ లా పని చేయవచ్చు. మరికొందరికి ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు.

Bed Coffee Tips: ఉదయాన్నే బెడ్ కాఫీ తాగే అలవాటు మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?
Tea And Coffee Cravings
Follow us on

చాలా మందికి ఉదయాన్నే తాజాగా తయారు చేసిన ఒక కప్పు కాఫీ తాగడం అలవాటు. ముఖ్యంగా ఉదయాన్నే లేచి కాఫీ తాగే అలవాటు మంచిదా? చెడ్డదా? అనే వాదన దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. అయితే, కాఫీలో కెఫీన్ అనే పదార్థం జీర్ణక్రియకు కీడు చేస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మనిషి ఆరోగ్య స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుందని తేలింది. ఇది తరచుగా జన్యు వైవిధ్యాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఉదయాన్నే కాఫీ తాగే కొంతమందికి బూస్ట్ లా పని చేయవచ్చు. మరికొందరికి ఎలాంటి పాజిటివ్ ఎఫెక్ట్స్ ఉండకపోవచ్చు. ఇది మొత్తం శరీరతత్త్వంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మానిసిక స్థితిని మెరుగుపర్చడానికి చాలా మంది కాఫీ తాగడాన్ని ఇష్టపడతారు. కొంత మంది జిమ్ చేసేవారు కూడా ఉదయాన్నే కాఫీ తాగుతుంటారు. ఎందుకంటే జిమ్ చేసే మూడ్ ను కాఫీ పెంచుతుందని వారి నమ్మకం. కెఫిన్ జీవక్రియకు మెరుగుపరుస్తుంది. అందువల్ల వాళ్లు ఉత్సాహంగా పని చేస్తారు.

తీవ్రమైన గ్యాస్ట్రిక్ డిస్ట్రబెన్స్, పొట్టలో పుండ్లు లేదా ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు అధిక కెఫిన్ తీసుకోకూడదు. అలాంటి వారు ఉదయాన్నే లేచిన వెంటనే కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది గ్యాస్ట్రిక్ ను పెంచుతుందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో తేలింది. పొట్ట చాలా శక్తివంతమైన కవచంతో ఉంటుంది. ఇది ఎలాంటి ఆహారం తీసుకున్నా జీర్ణం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో రోజుకు మూడు కంటే ఎక్కువ సార్లు కాఫీ తాగే వారు దాదాపు 8000 మందితో చేసిన పరిశోధనలో పేగులు పుండ్లు పడడానికి కాఫీ సేవించడానికి ఎలాంటి సంబంధం లేదని తేలిసింది.  కానీ, పేగుల ఆరోగ్యంపై మాత్రం ప్రభావం చూపిస్తుంది. పేగుల కదిలికలపై కాఫీ సేవించడం తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కెఫిన్ సరిగ్గా జీర్ణం కాకపోతే గుండె పోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది. అలాగే రక్తపోటు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే పడుకునే ముందు కాఫీ తాగితే నిద్రలేమి సమస్యలు ఇబ్బంది పెడతాయని నిపుణులు చెబుతున్నారు. 

లేచిన వెంటనే కాఫీ తాగవచ్చా?

ఎవరూ ఉదయం పూట ముందుగా కాఫీ తాగకూడదని చెప్పడం లేదు. కానీ కొందరికి ఇది లాభదాయకంంగా ఉంటుంది. కానీ మరికొందరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరికొందరిలో పేగు కదలికను కూడా ప్రారంభమవుతుందని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి, కాఫీ అనివార్యంగా కడుపులో యాసిడ్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని కొద్దిగా పలుచన చేయడానికి కాఫీ పౌడర్ తక్కువ వేసుకుని తాగడం మంచిది. ముఖ్యంగా నిపుణులు సూచనల ప్రకారం ఉదయాన్నే టిఫిన్ తో పాటుగా కాఫీ తాగడం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..