Eggs: వర్షాకాలంలో గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు చెప్పేందేంటి

గుడ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. తక్కువ ఖర్చుతో ఎక్కవ పోషకాలు అందించే ఆహారం ఏదైనా ఉందంటే అది కేవలం గుడ్డు మాత్రమే.. ఇందులో మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. బాడీని లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంచడంలో ఇది ఎంతో బాగా పనిచేస్తుంది. అయితే వర్షాకాలంలో ఈ గడ్లు తినడం మచిందేనా అనే డౌట్ చాలా మందిలో ఉంది. కాబట్టి ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం.

Eggs: వర్షాకాలంలో గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు చెప్పేందేంటి
Eggs In Rainy Season

Updated on: Jun 13, 2026 | 4:42 PM

వర్షాకాలంలో మన బాడీలో రోగనిరోదక శక్తి తగ్గిపోతుంది. తద్వారా మనం త్వరగా అనారోగ్యం బారీన పడుతాం. ఇలాంటి సమయంలో గుడ్లు తినడం మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును వర్షాకాలపు అనారోగ్యాలు, ఇన్ఫెక్షన్లు అధికంగా ఉండే ఈ సమయంలో ఇది మన బాడీకి చాలా అవసరం. వర్షాకాలంలో, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, డయేరియా, మలబద్ధకం మొదలైన వ్యాధులను నివారించి, వాటితో పోరాడేందుకు గుడ్డులోని పోషకాలు ఎంతగానో ఉపయోగపడుతాయి. కాబట్టి వర్షాకాలంలో గుడ్లు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి.. వాటిని సరైన క్రమంలో ఎలా తినాలో తెలుసుకుందాం.

వర్షాకాలంలో గుడ్లు తినడం వల్ల ప్రయోజనాలు

రోగనిరోధక శక్తి : వర్షాకాలంలో గుడ్లు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిది. పెద్దలకు, పిల్లలకు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు గుడ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎగ్స్‌లో విటమిన్ డి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో తోల్పడుతుంది. తద్వారా వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల బారీన పడకుండా అడ్డుకుటుంది.

ఇవి కూడా చదవండి

అధిక ప్రోటీన్: చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే గుడ్లు ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. ఇది కండరాల పెరుగుదల, మరమ్మత్తుకు చాలా అవసరం. ప్రోటీన్ అనేక ఆరోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.ఈ వర్షాకాలంలో మీ రోగనిరోధక శక్తికి ఎంతో అవసరమైన బలాన్ని ఇస్తుంది .

యాంటీఆక్సిడెంట్ : గుడ్లలో ‘లుటీన్’, జీయాక్సాంథిన్’ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడి, వాపును తగ్గిస్తాయి. అలాగే గుడ్లతో ఉండే ఉండే యాంటీఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు, వయసు సంబంధిత మాక్యులర్ డీజెనరేషన్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి.

జుట్టు ఆరోగ్యం: గుడ్లలో ఉండే ప్రోటిన్ చర్మానికి, జుట్టుకు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. గుడ్లలో బయోటిన్, విటమిన్ బి12, ఆరోగ్యకరమైన జుట్టు, గోళ్ల పెరుగుదలను ప్రోత్సహించే ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయి.

బరువు నిర్వహణ: బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు చాలా మంచివి. ఎందుకంటే గుడ్లలో కేలరీలు తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కవ సమయం మీకు కడుపు నిండిన అభువాన్ని ఇస్తుంది. తద్వారా మీకు ఎక్కవగా తినడకుండా చేస్తుంది. దీని వల్ల మీరు బరువు పెరగకుండా అడ్డుకుంటుంది.

రక్తహీనతను తగ్గిస్తుంది: గుడ్లలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను తగ్గించడంలో, ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తి చేయడంలో ఎంతగానో సహాయపడుతుంది.

వర్షాకాలంలో గుడ్లు తినడానికి ఉత్తమ మార్గాలు

  • ఉడికించినవి లేదా పోచ్డ్ ఎగ్స్: కోడిగుడ్లను ఉడికించి లేదా పోచ్డ్ రూపంలో స్నాక్‌గా తీసుకోవచ్చు. వీటిని సూప్‌లు, సలాడ్‌లలో కూడా కలుపుకోవచ్చు. 
  • ఆమ్లెట్ : ఉదయం పూట పౌష్టికాహారంగా క్యాప్సికమ్, ఉల్లిపాయలు, పుట్టగొడుగులు వంటి ముక్కలను వేసి వేడివేడిగా ఆమ్లెట్ వేసుకోవచ్చు. 
  • స్క్రాంబుల్డ్ ఎగ్స్: పాలకూర, టమోటాలు కలిపి కోడిగుడ్డు పొరటు చేసి, హోల్ వీట్ బ్రెడ్ టోస్ట్‌తో కలిపి తింటే ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవచ్చు. 
  • ఎగ్ సూప్ : వర్షం పడేటప్పుడు వేడివేడిగా తాగడానికి ఇదొక చక్కని కంఫర్ట్ ఫుడ్. రకరకాల కూరగాయలు, నూడుల్స్ వేసి ఈ ఎగ్ సూప్‌ను తయారు చేసుకోవచ్చు. 
  • ఎగ్ కర్రీ : భారతదేశంలో ఈ వంటకం చాలా ప్రసిద్ధి చెందింది. మసాలాలు, కూరగాయలు వేసి రుచికరమైన ఎగ్ కర్రీ వండుకుని అన్నం లేదా రోటీతో కలిపి ఆస్వాదించవచ్చు..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us