Expensive Mango: ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు..సూర్య రశ్మి గుడ్లుగా ప్రసిద్ధి.. కిలో 2.70 లక్షలు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..

|

Apr 27, 2022 | 2:36 PM

Expensive Mango: భారతదేశం(Bhrath) మామిడి పండ్లకు ప్రసిద్ధి. మన దేశ జాతీయ పండు మామిడి. అనేక ఆయుర్వేద ఔషధగుణాలు కూడా కలిగి ఉన్నది. 'పండ్ల రాజు' అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్..

Expensive Mango: ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లు..సూర్య రశ్మి గుడ్లుగా ప్రసిద్ధి.. కిలో 2.70 లక్షలు.. దీని స్పెషాలిటీ ఏమిటంటే..
Miyazaki Mangoes
Follow us on

Expensive Mango: భారతదేశం(Bhrath) మామిడి పండ్లకు ప్రసిద్ధి. మన దేశ జాతీయ పండు మామిడి. అనేక ఆయుర్వేద ఔషధగుణాలు కూడా కలిగి ఉన్నది. ‘పండ్ల రాజు’ అని కూడా పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఉత్తరప్రదేశ్ (Uttar pradesh), కర్ణాటక, బీహార్, గుజరాత్, తమిళనాడు వంటి అనేక రాష్ట్రాల్లో మామిడి పండ్లను పండిస్తారు. అయితే ఉత్తరప్రదేశ్ మామిడి ఉత్పత్తిలో 23.47% వాటా కలిగి ఉంది. అంతేకాదు.. దేశంలోనే మామిడి ఉత్పాదకతతో మొదటి స్థానంలో ఉంది.

భారతదేశంలో బంగిన పల్లి, కలెక్టర్ మామిడి, నీలవేణి, రసాలు, చెరకు రసం, చిన్న రసాలు, పెద్ద రసాలు, సువర్ణ మామిడి, అరటి మామిడి, కొబ్బరి మామిడి ఇలా అనేక రకాల మామిడి పండ్లను ఎక్కువగా పండిస్తారు.  ప్రపంచ దేశాల్లో అత్యధిక శాతం మామిడి పండ్లు భారత దేశం నుంచే అవుతాయి. అయితే మామిడి పండ్లలో అత్యంత ఖరీదైన వెరైటీ మామిడి మాత్రం మనదేశానికి చెందినది కాదు. చూడ చక్కని ఊదా రంగులో ఉండే ఈ మామిడి కాయను మియాజాకి మామిడి అని అంటారు.

మామిడి పండ్లను ప్రత్యేక సందర్భాల్లో బహుమతిగా ఇస్తారు. ఇక వివిధ రకాల ఆహారపు వంటల్లోను, కూరలు, షేక్‌లు లేదా ఐస్‌క్రీమ్‌లు వంటి అనేక వంటకాలలో కూడా మామిడిని ఉపయోగిస్తారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిపండు నిజానికి జపాన్‌కు చెందినది. దీనిని మియాజాకి మామిడి అని పిలుస్తారు మరియు దీనిని జపాన్‌లోని మియాజాకి నగరంలో పండిస్తారు, అందుకే ఈ పేరు వచ్చింది. ఇది దేశంలో పండించే అత్యంత ప్రసిద్ధ పండ్లలో ఒకటి మరియు 350g కంటే ఎక్కువ బరువు ఉంటుంది మరియు 15% లేదా అంతకంటే ఎక్కువ చక్కెర కంటెంట్ కలిగి ఉంటుంది. ఇది జపాన్‌లోని మియాజాకి నగరంలో పండిస్తారు.

ఈ ప్రత్యేకమైన మామిడి భారతదేశం,  ఆగ్నేయాసియాలో ప్రసిద్ధి చెందిన సాధారణ మామిడి రకాల కంటే భిన్నమైన రూపానికి , రంగును కలిగి ఉంది.. ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అత్యంత నాణ్యమైన మియాజాకి మామిడి పండ్లను ‘తైయో-నో-టొమాగో’ లేదా ‘సూర్యరశ్మి గుడ్లు’గా పిలుస్తారు. ఈ మామిడి పండు రంగు ఉదారంగులో మెరిసిపోతూ ఉంటుంది. పండినప్పుడు ఉదా రంగు నుంచి ఎర్ర రంగులోకి మారతాయి. చూడడానికి ఒక పెద్ద డైనోసార్ గుడ్డు ఆకారంలో ఉంటుంది.

మియాజాకి మామిడి సాగుకు  అధిక సూర్యరశ్మి, వెచ్చని వాతావరణం, పుష్కలంగా వర్షపాతం అవసరం. ప్రతి మామిడి పండు చుట్టూ రక్షిత వల ఉంటుంది. దీంతో సూర్యరశ్మి ఈ పండ్లను తాకడంతో ప్రత్యేక ఆకృతిని ఇస్తుంది. మియాజాకి నగరంలో 1970-1980ల మధ్య మామిడి పండించడం ప్రారంభించారని తెలుస్తోంది. ఈ పండ్లు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. మామిడి పండ్లలో ఎక్కువ భాగం మే నుండి జూన్ మధ్య అమ్ముడవుతుంది. మియాజాకి మామిడిలో యాంటీఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది.  బీటా-కెరోటిన్, ఫోలిక్ యాసిడ్ కలిగి ఉంటుంది. ఈ పండు దృష్టిలోపలం కలిగిన వారికీ మంచి ఔషధంగా ప్రసిద్ధిగాంచింది. అలసిపోయిన కళ్ళు ఉన్నవారికి మంచి సహాయకారి.

ఇది ప్రపంచంలో అత్యంత ప్రీమియం పండ్లలో ఒకటి. జపాన్‌లో విక్రయించే అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి.  అంతర్జాతీయ మార్కెట్ లో కిలో మామిడి ధర రూ. 2.70 లక్షల నుంచి మూడు లక్షల వరకూ ఉంది.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడిగా రికార్డ్ సృష్టించైనా ఈ మామిడి పండ్లు ఇప్పుడు ఇతర దేశాల్లోనూ అడుగు పెట్టింది. ఇప్పుడు ఈ మియాజాకి మామిడిని భారతదేశం,బంగ్లాదేశ్‌, థాయిలాండ్ , ఫిలిప్పీన్స్‌లో కూడా పండిస్తున్నారు. ఇటీవల, మధ్యప్రదేశ్‌లోని ఒక జంట జబల్‌పూర్‌లోని తమ పొలంలో మియాజాకి మామిడి రకాన్ని పండించారు. అరుదైన మామిడి పండ్లను దొంగిలించకుండా కాపాడేందుకు నలుగురు గార్డులను, ఏడు కుక్కలను నియమించుకోవాల్సి వచ్చింది

Also Read: Chandrababu Naidu: విచారణకు హాజరుకాని చంద్రబాబు, బోండా ఉమా.. ఏపీలో మరింత ముదురుతున్న వివాదం..