ప్రతి సీజన్‌లో చర్మాన్ని సంరక్షించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ చర్మం నిర్జీవంగా మారిపోతుంది. అంతే కాదు 30ఏళ్ల తర్వాత చర్మంలో ముడతలు వస్తాయి. ఈ సమస్యను అధిగమించడానికి, మహిళలు అనేక రకాల సౌందర్య సాధనాలను కూడా ఉపయోగిస్తారు. కానీ వాటిని ఉపయోగించడం వల్ల మీ చర్మం దెబ్బతింటుంది. మీరు ముఖంపై మచ్చలు, చర్మం ముడతలతో బాధపడుతున్నట్లయితే మీరు కొబ్బరి నూనె చిట్కాలను పాటించండి.. కొబ్బరి నూనెను ముఖానికి ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
కొబ్బరి నూనెను ముఖానికి ఇలా అప్లై చేయాలి..
విటమిన్ ఇ ఆయిల్ – కొబ్బరి నూనె: విటమిన్ ఇ,కొబ్బరి నూనె మిశ్రమం చర్మం ముడుతలకు చికిత్స చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం విటమిన్ ఇ క్యాప్సూల్‌ను కట్ చేసి, ఆపై కొబ్బరి నూనెలో కలపండి. బాగా కలిపిన తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కుని ముఖంపై అప్లై చేసి మసాజ్ చేయాలి. విటమిన్ ఇ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది డల్ స్కిన్‌ని రిఫ్రెష్ చేస్తుంది. మీ చర్మంపై ముడతల సమస్యను తొలగిస్తుంది.
పసుపు- కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో పసుపు కలిపి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది. కొబ్బరి నూనెలో పసుపు వేసి బాగా కలపాలి. ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు బాగా ఆరనివ్వండి. ఆ తర్వాత నీళ్లతో ముఖం కడుక్కోవాలి.
నిమ్మకాయ- కొబ్బరి నూనె: కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపండి. దానికి పచ్చి పాలను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత మీ ముఖానికి అప్లై చేసి చేతులతో మృదువుగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ముడతల సమస్య నుంచి బయటపడవచ్చు. ప్రతిరోజూ అప్లై చేస్తే, మీ చర్మం శుభ్రంగా, నిగినిగలాడుతూ మెరుస్తూ ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..