Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తల స్నానం చేసే ముందు మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? ఇలా చేస్తే ఏమౌతుందో తెలుసా..?

తలస్నానం చేసే పద్ధతిని సరిగ్గా అనుసరించకపోతే జుట్టు బలహీనపడటం, విరిగిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా తలస్నానం ముందు తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవడం అవసరం. వేడి నీరు, షాంపూ వాడే విధానం, తడి జుట్టును దువ్వడం వంటి విషయాల్లో జాగ్రత్తలు పాటిస్తే జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది.

తల స్నానం చేసే ముందు మీరు ఈ తప్పులు చేస్తున్నారా..? ఇలా చేస్తే ఏమౌతుందో తెలుసా..?
Healthy Hair
Follow us
Prashanthi V

|

Updated on: Mar 17, 2025 | 8:31 PM

తల స్నానం చేసే ముందు జుట్టును సరిగా దువ్వాలి. జుట్టు బాగా దువ్వితే స్నానం తర్వాత వచ్చే చికాకును తగ్గించుకోవచ్చు. జుట్టు తడి ఉండగా దువ్వడం వల్ల కుదుళ్లు నొప్పిపెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్నానం తర్వాత దువ్వకుండా వదిలేస్తే జుట్టు ఎక్కువగా రాలడమో, చిక్కుకుపోవడమో జరగవచ్చు. కాబట్టి ముందుగా దువ్వడం సౌకర్యవంతంగా ఉంటుంది.

వేడి నీటితో స్నానం చేసే వారు పాదాల నుంచి నీటిని పోసి చివరలో మాత్రమే తలపై వేడి నీటిని పోసుకోవడం మంచిది. ఎందుకంటే శరీరంలో మొత్తం వేడి తల మీదికి పెరగడం వల్ల తలనొప్పి, అలసట లాంటి సమస్యలు ఎదురవుతాయి. పాదాల నుంచి నీటిని పోసి చివరగా తలపై పోసుకుంటే శరీరానికి బాగుంటుంది.

స్నానం సమయంలో జుట్టు మొత్తం కూడా షాంపూ సమానంగా చేరేలా చూడాలి. కేవలం జుట్టు చివరల్లో మాత్రమే షాంపూ వేయకుండా మూలాల వరకు చేరేలా చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టుకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా జుట్టు వేర్లకు నాణ్యమైన విటమిన్లు అందడం వల్ల జుట్టు ఆరోగ్యకరంగా, పటిష్టంగా మారుతుంది.

తల స్నానం తర్వాత జుట్టును మెలికలు వేయడం లేదా గట్టిగా పిండడం మంచిది కాదు. జుట్టు తడి ఉన్నప్పుడు అలా చేయడం వల్ల జుట్టు బలహీనంగా మారి రాలిపోతుంది. కాబట్టి మెలికలు వేయకుండా నేరుగా నీటిని నిదానంగా పిండడం ఉత్తమం. ఈ విధంగా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడకుండా ఉంటాయి.

జుట్టును తుడవడానికి చాలా గట్టి టవల్ ఉపయోగించడం మంచిది కాదు. సన్నని టవల్ ఉపయోగించడం వల్ల జుట్టు సురక్షితంగా ఉంటుంది. అలాగే తల చుట్టూ టవల్‌ను ఎక్కువసేపు చుట్టుకోకూడదు. దీనివల్ల జుట్టు మరింత చిక్కుకు పోతుంది. అలాగే జుట్టు విరిగిపోవడం కూడా ఎక్కువగా ఉంటుంది.

తల స్నానం తర్వాత జుట్టులో ఉన్న చిక్కులు తొలగించేందుకు చక్కటి దంతాలు ఉన్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వాలి. సురక్షితమైన మార్గం అంటే దిగువ నుండి పైకి దువ్వడం. ఇలా చేయడం వల్ల జుట్టు సులభంగా చిక్కులను కోల్పోకుండా మృదువుగా ఉంటుంది. తల స్నానం చేసే పద్దతులను అనుసరించడం ద్వారా జుట్టు ఆరోగ్యకరంగా, బలంగా ఉంటుంది.