Miss World 2021: మిస్ వరల్డ్ పోటీల్లో హైదరాబాదీ యువతి.. ఈ గ్లామర్ గర్ల్‌కు అందమైన రూపమే కాదు.. అందమైన మనసు కూడా.. వివరాల్లోకి వెళ్తే..

|

Dec 15, 2021 | 1:35 PM

Miss World 2021 Finale: అందం అనేది సానుకూల దృక్పథం, విశ్వాసం,  వ్యక్తిత్వానికి సంబంధించినది.  భారతీయ యువతి మానస వారణాసి నిజంగా అందమైన అమ్మాయి అని మనం..

Miss World 2021: మిస్ వరల్డ్ పోటీల్లో హైదరాబాదీ యువతి.. ఈ గ్లామర్ గర్ల్‌కు అందమైన రూపమే కాదు.. అందమైన మనసు కూడా.. వివరాల్లోకి వెళ్తే..
Manasa Varanasi
Follow us on

Miss World 2021 Finale: అందం అనేది సానుకూల దృక్పథం, విశ్వాసం,  వ్యక్తిత్వానికి సంబంధించినది.  భారతీయ యువతి మానస వారణాసి నిజంగా అందమైన అమ్మాయి అని మనం నిశ్చయంగా చెప్పగలం! హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి త్వరలో మిస్ వరల్డ్ 2021లో కిరీటాన్ని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది.. ఈరోజు ఆ అందాల రాణి గురించి వివరంగా  తెలుసుకుందాం..

మానస వారణాసి.. అందమైన అందాల రాణి.. భాగ్యనగరానికి చెందిన అమ్మాయి. ప్యూర్టో రికోలోని శాన్ జువాన్, కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో 2021, డిసెంబర్ 16న జరగబోయే మిస్ వరల్డ్ 2021 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మిస్ ఇండియా 2020 కిరీటాన్ని కైవసం చేసుకుంది గ్లామర్ గర్ల్.

మానస తండ్రి మలేషియాకు వెళ్లడంతో.. మానస 2011-12 బ్యాచ్‌లో జిఐఐఎస్ మలేషియా క్యాంపస్ నుండి గ్రేడ్ 10 పూర్తి చేసింది. అనంతరం హైదరాబాదులో ఎఫ్ఐఐటి జెఈఈలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదువును పూర్తిచేసి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ అనలిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించింది.

మిస్ వరల్డ్ 2000 పోటీ విజేత అయిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇన్స్పిరేషన్ తో మిస్ ఇండియా వరల్డ్ 2020  పోటీల్లో పాల్గొంది. మానస  శాస్త్రీయ నృత్యం భరతనాట్యంలో కూడా శిక్షణ పొందింది. తన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్ (BWAP)లో భాగంగా, మానస తెలంగాణ ప్రభుత్వంతో చురుకుగా పని చేస్తోంది.  ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా  మహిళలు,  పిల్లల హక్కుల పరిరక్షణ కోసం ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఇటీవల ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. మహిళల రక్షణ కోసం మహిళా అభివృద్ధి,  శిశు సంక్షేమ శాఖ 33 వాహనాలను విడుదల చేసింది.

మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకోవడానికి ముందు కూడా.. మానస స్థానిక NGOతో కలిసి పనిచేసింది. పేద పిల్లలకు ఇంగ్లీష్, గణితం బోధించేది.

23 ఏళ్ల మానస శరీరం ఫిట్ గా ఉండడానికి యోగా సాధన. ఆమె ఖాళీ సమయంలో పుస్తకాలు చదవుంటుంది. సంగీతం వింటుంది.  ఈ గ్లామర్ గాళ్ మిస్ ఇండియా 2020 విజేత.. తన చెల్లెలు, అమ్మమ్మ, తన తల్లి తన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన ముగ్గురు వ్యక్తులని చెప్పింది.

తన కల మిస్ వరల్డ్ 2021 టైటిల్‌ను గెలుచుకోవడం అని చెబుతుంది.  డిసెంబర్ 16న 70వ అందాల పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉంది. ఈక్రమంలో మిస్ వరల్డ్ కిరీటంపై కన్నేసిన మానస వారణాసి ఈ పోటీల్లో పాల్గొని విజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ ఈవెంట్ లో దాదాపు 100మంది సుందరాంగులు పాల్గొనే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:  తెలంగాణ మాజీ గవర్నర్‌కు తీవ్ర అస్వస్తత.. ఐసియులో చికిత్స.. పరామర్శించిన సీఎం కేసీఆర్..