మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం ఈ ఆయిల్‌ ది బెస్ట్‌..! ట్రై చేసి చూడండి..

అందువల్ల ఈ నూనెను చర్మ సంబంధ వ్యాధులను తగ్గించే ఆయింట్‌మెంట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వేప నూనెలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతల్ని తగ్గిస్తాయి. తద్వారా వృద్ధాప్య ఛాయల్ని నివారించి మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఈ వేప నూనె అందరికీ పడకపోవచ్చు. దీనిని తెలుసుకునేందుకు చిన్న ప్యాచ్ టెస్ట్ చేయండి.

మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం ఈ ఆయిల్‌ ది బెస్ట్‌..! ట్రై చేసి చూడండి..
Neem Oil

Updated on: Feb 15, 2025 | 2:41 PM

ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో పాటు, చర్మం, జుట్టు సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. ముఖంపై మొటిమలు, మచ్చలతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అయితే వీటిని తగ్గించుకోవాలనే ఆరాటంతో అనేక కెమికల్‌ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. దీంతో ఆశించిన ఫలితం లేకపోగా, అనేక సైడ్‌ ఎఫెక్టస్‌ వెంటాడుతున్నాయి. కానీ, ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో వేప ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం చాలా మంది మర్చిపోతున్నేఆరు. వేపలోని యాంటీబయాటిక్ గుణాలు చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. వేప నూనెతో చర్మ సౌందర్యం రెట్టింపు అవుతుందని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

వేప నూనెలోని యాంటీ మైక్రోబియల్, యాంటీ బ్యాక్టీరియల్, ఔషధ గుణాలు చర్మంతో పాటు జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి. వేప నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు మొటిమలను నివారించడంలో సహాయపడతాయి. రాత్రిపూట మీ ముఖానికి ఈ నూనె అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేప నూనెలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు సూర్యకిరణాల నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి నష్టం జరగకుండా కాపాడతాయి.

వేప నూనెలో లినోలిక్ యాసిడ్, పాల్మిటిక్ యాసిడ్, స్టెరిక్ యాసిడ్, ఒలియిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. ఇవి చర్మం పొడిబారడాన్ని నివారించి స్కిన్‌ను తేమగా మారుస్తాయి. చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌ నివారించడంలో వేప నూనె సహాయపడుతుంది. ఈ నూనెలోని గెడునిన్, నింబిడోల్ అనే యాంటీఫంగల్ సమ్మేళనాలు ఇన్ఫెక్షన్స్‌ను నివారిస్తాయి. వేపలోని నింబిడిన్ సమ్మేళనం తామర వంటి ప్రమాదకరమైన చర్మ సంబంధ వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. తామర, గజ్జిని తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

సొరియాసిస్ వంటి చర్మ సంబంధ సమస్యలను తొలగించడంలోనూ వేప నూనె సహాయపడుతుంది. అందువల్ల ఈ నూనెను చర్మ సంబంధ వ్యాధులను తగ్గించే ఆయింట్‌మెంట్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వేప నూనెలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతల్ని తగ్గిస్తాయి. తద్వారా వృద్ధాప్య ఛాయల్ని నివారించి మిమ్మల్ని యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఈ వేప నూనె అందరికీ పడకపోవచ్చు. దీనిని తెలుసుకునేందుకు చిన్న ప్యాచ్ టెస్ట్ చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..