Lifestyle: అబ్బాయిలూ ఈ ఫుడ్స్ ఎక్కవగా తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. అవైడ్ చేయకపోతే మీ స్పెర్మ్ కౌంట్ మటాషే
రోజురోజుకూ మారుతున్న లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా జంక్‌ఫుడ్, అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు పురుషుల ఆరోగ్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి సమస్యలు, స్పెర్మ్ కౌంట్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయని ఇటీవల జరిగిన కొన్ని పరిశోదనల్లో వెల్లడైంది.

మీరు తినే ఆహారంమే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కానీ ప్రస్తుత రోజుల్లో మనం తినే కొన్ని ఆహారాలు మన ఆరోగ్యాన్ని ఎంతలా నాశనం చేస్తున్నాయో చాలా మందికి తెలియదు. వీటిలో అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాల గురించి మాట్లాడుకుంటే.. ఈ ఫుడ్స్ పురుషుకు చాలా ప్రమాదకరం అంటున్నారు ఆరోగ్యనిపుణులు. ఎందుకంటే అల్ట్రా-ప్రాసెస్ చేసిన పదార్థాలు పురుషుల సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఇటీవల జరిగిపిన పరిశోధనలో తేలింది. ఈ ఆహారాలను అధికంగా తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గే ప్రమాదం కూడా ఉందని సంటిస్టులు గుర్తించారు.
43 మంది పురుషుల సర్వే
ఎకనామిక్ టైమ్స్ సెల్ మెటబాలిజం జర్నల్‌లో ప్రచురించబడిన ఒక పరిశోధన ప్రకారం.. పురుషులపై ఈ అల్ట్రా ప్రాసెస్ చేసి ఫుడ్స్ ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో తెలుసుకునేందుకు పరిశోధకులు 43 మందిపై సర్వే చేశారు. ఈ సర్వేలో సాధారణ ఫుడ్, అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే పురుషుల మధ్య తేడాను గమనించారు. వీరిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపుకు మూడు వారాల పాటు అధిక కొవ్వు ఆహారం, మూడు వారాల పాటు ప్రాసెస్ చేయని ఆహారాన్ని ఇచ్చారు. మరొక గ్రూపుకు అవసరమైన దానికంటే 500 కేలరీలు ఎక్కువ అధిక కేలరీల ఆహారం ఇచ్చారు. అయితే ఈ సర్వే తర్వాత అల్ట్రా-ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకున్న పురుషులలో సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని గమనించారు.
పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది
అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల పురుషుల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. ఇది వారి సంతానోత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. ఇంతలో, అధిక కేలరీలు, అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారం తిన్న పురుషులలో స్పెర్మ్ ఉత్పత్తికి అవసరమైన ఫోలికల్-స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH) తక్కువ స్థాయిలో ఉన్నట్లు గుర్తించబడింది.
పురుషుల లైంగిక హార్మోన్లపై కూడా ప్రభావం
ఇది పురుషులలో శుక్రకణ చలనశీలతను కూడా తగ్గిస్తుందని సర్వేలో తేలింది. ఇది cxMINP అనే రసాయనం వల్ల కావచ్చని పరిశోదకులు చెబుతున్నారు. ఈ ఎండోక్రైన్-డిస్ట్రప్టర్లు హార్మోన్ స్థాయిలలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. అందుకే అల్ట్రా-ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరగడమే కాకుండా లైంగిక హార్మోన్లపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది.
(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




