Skincare Tips For Men: మగవారి చర్మం మిల మిల మెరవాలంటే.. పాటించవలసిన సహజ పద్దతులు, సూత్రాలు.. తప్పక తెలుసుకోండి..

వినడానికి వింతగా అనిపించినా కొన్ని నిజాలు నమ్మక తప్పదు. చాలా మంది మన రూపురేఖల ఆధారంగానే మనపై నిర్ణయాలను ఏర్పరుచుకుంటారు. అందుకోసం నిరంతర పోటీ కోసం సిద్ధంగా ఉండవలసిన పరిస్థితి. అందులో..

Skincare Tips For Men: మగవారి చర్మం మిల మిల మెరవాలంటే.. పాటించవలసిన సహజ పద్దతులు, సూత్రాలు.. తప్పక తెలుసుకోండి..
Glowing Skin For Male

Updated on: Dec 24, 2022 | 9:13 AM

వినడానికి వింతగా అనిపించినా కొన్ని నిజాలు నమ్మక తప్పదు. చాలా మంది మన రూపురేఖల ఆధారంగానే మనపై నిర్ణయాలను ఏర్పరుచుకుంటారు. ఇది మానవ జీవన విధానంలో ఒక భాగంగా కూడా మారిపోయింది. అందుకోసం నిరంతర పోటీ కోసం సిద్ధంగా ఉండవలసిన పరిస్థితి. అందులో భాగంగానే చూడడానికి మంచిగా కనిసించేలా చూసుకోవడం తప్పనిసరి. అలా లేకపోతే ఎంత గొప్పవారైనా ఇబ్బందులు పడక తప్పదు. అలాంటి సమస్యలు ఆడవారికే కాదు. వారి కంటే మగవారికే ఎక్కువగా ఉంటాయి. అందుకోసం మగవారు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చర్మ సంరక్షణ. చర్మాన్ని కాపాడుకోవాలని కేవలం ఆడవారికే కాదు, మగవారికి కూడా ఉంటుంది. అయితే ఏం చేయాలో తెలియక సమస్యలతోనే ఇబ్బంది పడుతుంటారు పురుషులు. చర్మాన్ని రక్షించుకోవడం ద్వారా మగవారు మరింత అందంగా కనిపించగలుగుతారు.

అయితే చర్మానికి వచ్చే సమస్యలు ఒకటి, రెండు కాదు.. చాలానే ఉన్నాయి. జిడ్డు, పొడిబారడం చర్మం, ముడతలు, పగిలడం .. ఇలా ఎన్నో సమస్యలతో చర్మం పాడయిపోతుంది. ముఖ్యంగా చర్మం తేజస్సు లేకుండా మసకబారినట్లుగా కనిపిస్తుంది. మరి ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో.. అందుకోసం ఏంచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖాన్ని శుబ్రపరుచుకోవాలి:

అనునిత్యం  ముఖాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బద్దకం కారణంగా మీరు అలా చేయడ మర్చిపోతే ఫేస్ వాష్‌లను ఉపయోగించి అయినా శుభ్రపరుచుకోవడం అత్యవసరం. ఒక వేళ చర్మ సంరక్షణ కోసం ఏదైనా క్రీమ్ వాడాలనుకుంటే..  మీ చర్మం ఏ రకమైనదనేది తెలుసుకొని మాత్రమే క్రీమ్‌లను ఉపయోగించాలి. అలాగే ముఖాన్ని శుభ్రపరుచుకోవడం కోసం సబ్బును ఉపయోగించకపోవడం ఎంతో మంచిది. ఎందుకంటే ఒక ఫ్రాన్స్ రచయిత్రి రచించిన “బ్యూటీ” అనే పుస్తకంలో సబ్బు గురించి ‘‘సబ్బు చూపించే ప్రభావం మెడ కింది బాగంలో ఉన్న చర్మానికి మాత్రమే ఉపయోగ పడుతుంది” అని తెలిపారు. అందుకే ముఖాన్ని శుభ్రం చేసేందుకు సబ్బు కన్నా “ఫేస్ వాష్” తో కాని, ఏదైన “క్రీం” తో కానీ శుబ్రం చేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

చర్మంలోని మార్పు ఎంతో అవసరం:

మన చర్మంలో చనిపొయిన డెడ్ స్కిన్ కణాలను తొలగిస్తూ ఉండాలి. దీని వల్ల చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది. ఇటీవల ఒక అధ్యయనంలో ఆడవారి కన్నా మగవారు అధిక శాతం యవ్వనంగా కనిపిస్తారు. ఎందుకంటే మగవారు షేవ్ చేసుకునే ప్రతీసారి వారి చర్మంలోని కణాలలో మార్పు వస్తూ, కొత్త కణాలు పుడతాయి.

సన్ స్క్రీన్

చర్మ సంరక్షణలో సన్ స్క్రీన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మీరు ఎండలోకి వెళుతున్నట్లయితే సన్ స్క్రీన్‌ను తప్పనిసరిగా వెళ్లే 30 నిమిషాల ముందు ఉపయోగించుట అవసరం. సన్ స్క్రీన్ మన చర్మాన్ని సూర్య కిరణాల నుంచి కాపాడుతుంది. తద్వారా చర్మం పొడిబారకుండా ఉంటుంది.

చర్మాన్ని తేమగా ఉంచడం..

సాధారణంగా మగవారి చర్మం స్త్రీల కన్నా ఎక్కువ జిడ్డును కలిగి ఉంటుంది. అందువల్ల మగవారికి తొందరగా ముడతలు వచ్చే ప్రమాదం ఉంది. మన చర్మాన్ని ఎప్పటికప్పుడు తేమగా ఉంచే “మాయిశ్చరైజర్ లేదా క్రీమ్”లను వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే జిడ్డు చర్మాన్ని పరిష్కరించుకోవచ్చు. షేవింగ్ తరువాత, లేదా పడుకునే ముందు మాయిశ్చరైజర్ లేదా క్రీమ్ ఉపయోగిస్తే చర్మానికి ఎంతో మంచిది.

మరిన్ని లైఫ్ ‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..