Raw Milk Scrub: మీ ముఖం మెరిసిపోవాలని కోరుకుంటున్నారా..? అయితే పచ్చి పాలతో ఈ విధంగా చేయండి..

|

Dec 06, 2022 | 7:18 PM

వాతావరణంలోని దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మంపై చాలా టాన్ పేరుకుపోతుంది. ముఖ్యంగా ముఖంపై చాలా మచ్చలు కూడా ఏర్పడతాయి. టాన్ కారనంగా చర్మంపై పేరుకున్న మురికి..

Raw Milk Scrub: మీ ముఖం మెరిసిపోవాలని కోరుకుంటున్నారా..? అయితే పచ్చి పాలతో ఈ విధంగా చేయండి..
Face Mask With Raw Milk
Follow us on

వాతావరణంలోని దుమ్ము, కాలుష్యం కారణంగా చర్మంపై చాలా టాన్ పేరుకుపోతుంది. ముఖ్యంగా ముఖంపై చాలా మచ్చలు కూడా ఏర్పడతాయి. టాన్ కారణంగా చర్మంపై పేరుకున్న మురికి  స్వేద రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తుంది. పలితంగా ముఖంపై మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలు కలుగుతాయి. అటువంటి పరిస్థితులలో చర్మాన్ని క్రమం తప్పకుండా ముఖంపై స్క్రబ్బింగ్ చేయడం చాలా అవసరం. స్క్రబ్ మీ చర్మం, రంధ్రాలను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. చర్మానికి కెమికల్స్‌తో స్క్రబ్స్ చేసే బదులు ఇంట్లో తయారుచేసిన స్క్రబ్స్‌లను వాడుకోవడం మేలు.

మీరు పచ్చి పాలను ఉపయోగించి కూడా స్క్రబ్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీ చర్మం కాంతివంతంగా, తేమగా కనిపిస్తుంది. అయితే పచ్చి పాలతో స్క్రబ్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం..

ఒక గిన్నెలో 4 చెంచాల పాలు తీసుకోండి. అందులో అర చెంచా బియ్యం పిండి కలపాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి దానితో చర్మాన్ని స్క్రబ్ చేయండి. దీన్ని చర్మంపై కొద్దిసేపు రుద్దండి. ఇలా చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఇంకా రంధ్రాల నుంచి మురికి తొలగించి, చర్మం పొడిబారడాన్ని అరికడుతుంది. ఇంకా బియ్యం, పచ్చిపాలతో చేసిన స్క్రబ్ మొటిమల సమస్యను నయం చేయడమే కాక ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

పచ్చి పాలు, ఓట్స్ స్క్రబ్..

మీరు పచ్చి పాలలో ఓట్స్‌ని కలిపి కూడా స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. ఫలితంగా మీ చర్మం మెరిసిపోతుంది. దీని కోసం మీరు ఒక గిన్నెలో 1 స్పూన్ పచ్చి పాలు తీసుకొని దానికి 1 టేబుల్ స్పూన్ ఓట్స్ కలపండి. తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి దానితో చర్మంపై కాసేపు మసాజ్ చేయండి. కొన్ని నిమిషాల పాటు చర్మంపై వదిలేయండి. దీని తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి. మీరు ఈ స్క్రబ్‌ను వారానికి 1,  2 సార్లు ఉపయోగించవచ్చు.

పచ్చి పాలు, పప్పు స్క్రబ్..

ఈ విధమైన స్క్రబ్ కోసం మీరు పప్పును రాత్రంతా నానబెట్టిన తర్వాత బ్లెండర్లో ఉంచండి. దానికి కొంచెం పాలు కలపి రెండింటినీ బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని చర్మంపై కాసేపు మసాజ్ చేయండి. 5 నుంచి 10 నిమిషాల పాటు చర్మంపై అలా వదిలేయండి. తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి. మీరు ఈ స్క్రబ్‌ని వారానికి 2, 3 సార్లు ఉపయోగించవచ్చు.

బాదం, పాలు..

ముందుగా కొన్ని ఎండు బాదంపప్పులను పౌడర్‌గా రుబ్బుకోవాలి. ఒక గిన్నెలో 2, 3 స్పూన్ల పాలు తీసుకోండి. అందులో ఈ బాదం పొడి కలపాలి. ఈ రెండింటినీ బాగా మిక్స్ చేసి చర్మంపై కాసేపు మసాజ్ చేయండి. దీన్ని చర్మంపై కనీసం 10 నిమిషాలు ఉంచాలి. దీని తర్వాత సాధారణ నీటితో చర్మాన్ని కడగాలి. అంతే మీ ముఖ చర్మం మెరిసిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..