
భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడంలో మహాత్మా గాంధీ పోరాటాన్ని మరువలేము. అందుకే భారతీయులంతా జాతిపితగా ఆయనను కొలుస్తారు. భారతదేశ అభివృద్ధికి కూడా ఆయన సూచించిన ఎన్నో విషయాలను ఇప్పటికీ పాటిస్తాం. సత్యం, అహింస మార్గంలో స్వాతంత్య్రం సాధించిన గాంధీజీ అంటే ప్రతి ఒక్కరికీ అపారమైన గౌరవం. అలాగే నిరాండంబర జీవన విధానం పాటించిన గాంధీ జీవన విధానం గురించి మీకు తెలుసా? ఆయన ప్రతిరోజూ ఏం తినేవారు? ఆయన ఆహార నియమాలు ఎలా ఉంటాయో? తెలుసా?.. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, ఆహార అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరినీ ఊబకాయం సమస్య వేధిస్తుంది. కాబట్టి ఊబకాయం సమస్య నుంచి రక్షణకు చాలా మంది వివిధ ఆహార విధానాలను పాటిస్తున్నారు. ఎలాంటి విధానాలను పాటించినా బరువు తగ్గడమే ప్రధాన ఎజెండాగా ఉంటుంది. అయితే కొంత మంది గాంధేయ జీవితం పాటిస్తే ప్రస్తుత కాలంలో చేసే డైట్‌కు కరెక్ట్‌గా సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. గాంధేయ జీవన విధానం శారీరకంగా చురుకుగా ఉండడంతో పాటు వీలైనంత ఎక్కువగా బహిరంగ ప్రదేశంలో నడవడం. ప్రాణాయామం సహాయంతో లయబద్ధమైన శ్వాస తీసుకోవడం, సాయంత్రం వేళల్లో సూపర్ లైట్ వ్యాయామాలు, బిజీ షెడ్యూల్‌ల మధ్య విశ్రాంతి తీసుకోవడం, అన్నీ ప్రశాంత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. బహిరంగంగా శుభ్రమైన ప్రదేశంలో నిద్రించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..