AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే అవాక్కవుతారు..

హిందూ సాంప్రదాయంలో ప్రతి చిన్న విషయానికి ఒక జ్యోతిష్య కారణం ఉంటుంది. ఈ క్రమంలోనే గుడిలో చెప్పులు పోవడం వెనుక ఒక గొప్ప శుభ సంకేతం దాగి ఉందని శాస్త్రం చెబుతోంది. మానవ శరీరంలో పాదరక్షలకు, శని దేవుడికి ఉన్న సంబంధం ఏమిటి? గుడి దగ్గర చెప్పులు పోతే ఏమవుతుంది? అనేది తెలుసుకుందాం..

గుడిలో చెప్పులు పోతే ఇంత అదృష్టమా.. శాస్త్రాలు చెప్పేది తెలిస్తే అవాక్కవుతారు..
Lost Your Slippers In A Temple
Krishna S
|

Updated on: Jul 06, 2026 | 12:58 PM

Share

సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్లినప్పుడు.. దేవుడి దర్శనంపై ఎంత శ్రద్ధ ఉంటుందో, బయట వదిలేసిన మన చెప్పుల మీద కూడా అంతే ధ్యాస ఉంటుంది. ‘‘ఎక్కడైనా చెప్పులు చోరీకి గురవుతాయేమో’’ అనే భయం చాలా మందిలో కనిపిస్తుంది. ఒకవేళ పొరపాటున చెప్పులు పోతే.. ఆ రోజు మన టైం బాలేదని బాధపడతాం.. లేదా తీవ్రమైన కోపానికి గురవుతాం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గుడి బయట చెప్పులు పోవడం అశుభం కాదు, సరికాదా అది ఒక మహా అదృష్ట సంకేతం అని పండితులు చెబుతున్నారు.

శని దోషాలు నశిస్తాయి..

జ్యోతిష్య శాస్త్రంలో మానవ శరీరంలోని పాదాలకు, మనం వేసుకునే పాదరక్షలకు శని గ్రహంతో బలమైన కనెక్షన్ ఉంటుంది. శని దేవుడి ప్రభావం పాదాలపై ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. అందుకే గుడి బయట మీ చెప్పులు దొంగిలించబడితే.. మీ జీవితంలో ఉన్న ప్రతికూల శక్తి, మిమ్మల్ని పీడిస్తున్న శని దోషాలు ఆ చెప్పులతో పాటే తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శని ప్రభావంతో ఇబ్బంది పడేవారికి ఇది ఒక ఉపశమనంగా మారుతుంది.

మంచి రోజులు మొదలైనట్టే.. అదృష్టానికి సంకేతం.

గుడిలో చెప్పులు పోవడాన్ని జీవితంలో ఒక సరికొత్త, సానుకూల మార్పుకు నాందిగా భావిస్తారు.

  • చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పడటం.
  • ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి లభించడం.
  • వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోవడం వంటి శుభ పరిణామాలు దీని తర్వాత జరుగుతాయని నమ్ముతారు.

శనివారం రోజు జరిగితే మరింత ప్రత్యేకం..

సాధారణ రోజుల్లో కంటే.. శనివారం రోజున ఏదైనా శని దేవుని ఆలయం లేదా హనుమాన్ మందిరం బయట చెప్పులు పోతే అది అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీనివల్ల శని దేవుని ఆగ్రహం చల్లబడి, ఏళ్ల తరబడి పీడిస్తున్న కష్టాల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల నమ్మకం. కొన్ని ప్రాంతాలలో శని దోష నివారణ కోసం కావాలనే శనివారం రోజు గుడి బయట పాత చెప్పులను వదిలేసి వస్తుంటారు.

చెప్పులు పోయినప్పుడు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి..

ఒకవేళ గుడి బయట మీ చెప్పులు పోయినట్లయితే.. పొరపాటున కూడా ఈ క్రింది పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది..

ఇతరుల చెప్పులు వేసుకోకండి: మీ చెప్పులు పోయాయని, అక్కడ ఉన్న వేరే ఎవరిదైనా చెప్పులు వేసుకుని రావడం మహా పాపం. అలా చేస్తే అవతలి వారి నెగెటివిటీ, శని దోషాలు మీ చుట్టుకుంటాయి.

కోపగించుకోవద్దు: చెప్పులు పోయినందుకు తీవ్రమైన కోపానికి గురికావడం లేదా నిరాశ చెందడం చేయకూడదు. దేవుడి సంకల్పం మేరకే ఇది జరిగిందని భావించాలి.

కొత్తవి కొనుక్కోండి: గుడి పరిసరాల్లో ఉండే షాపుల్లో వెంటనే కొత్త చెప్పులు కొనుక్కోవడం లేదా ప్రత్యామ్నాయం చూసుకుని ఇంటికి వెళ్ళాలి.

మనసు ప్రశాంతంగా: ఆలయంలో పొందిన దైవదర్శన అనుభూతిని పాడు చేసుకోకుండా, భగవంతుడిని స్మరిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి.

పాజిటివ్ థింకింగ్: నాకు మంచి జరగబోతోంది.. నా దోషాలన్నీ పోయాయి అనే ఒక సానుకూల ఆలోచనతో ఇంటికి తిరిగి వెళ్ళాలి.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా జ్యోతిష్య శాస్త్ర నిపుణుల అభిప్రాయాలు, మతపరమైన విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనికి Tv9 బాధ్యత వహించదు.)

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!